Liger Team: పూరీ-చార్మీ.. ఎక్కడ చూసినా ఈ జంట హడావుడే!

సౌత్ టు నార్త్.. ఎక్కడైనా ఈ జంట చేసే హడావిడీ మామూలుగా ఉండదు. సినిమా మీట్స్, ఈవెంట్స్ కానివ్వండి.. ప్రమోషన్స్, పబ్లిసిటీ అవనీయండి.. పార్టీలు, పబ్బులు.. చిల్ అయ్యే ప్లేసెస్ అయినా..

Liger Team: పూరీ-చార్మీ.. ఎక్కడ చూసినా ఈ జంట హడావుడే!

Liger Team

Liger Team: సౌత్ టు నార్త్.. ఎక్కడైనా ఈ జంట చేసే హడావిడీ మామూలుగా ఉండదు. సినిమా మీట్స్, ఈవెంట్స్ కానివ్వండి.. ప్రమోషన్స్, పబ్లిసిటీ అవనీయండి.. పార్టీలు, పబ్బులు.. చిల్ అయ్యే ప్లేసెస్ అయినా సరే.. వీళ్లదే జోరు. ఇప్పుడు వీళ్లిద్దరికీ తోడు క్రేజీగా రౌడీ బాయ్ యాడ్ అయ్యాడు. ఇంకేముంది ముంబై మాదే అన్నట్టు రెచ్చిపోతున్నారు. ఇంతకీ ఈ హాట్ గ్రూప్ మెంబర్స్ ఎవరంటారా..? అదే లైగర్ టీమ్.

Liger : భారీ ధరకు అమ్ముడైన ‘లైగర్’ డిజిటల్ రైట్స్

సింగిల్ కాదు.. ఎప్పుడూ మింగిల్ గానే కనిపిస్తున్నారు పూరీ జగన్నాథ్, ఛార్మీ. రీసెంట్ గా బాలీవుడ్ ప్రొడ్యూసర్ అపూర్వ మెహతా బర్త్ డే పార్టీలోనూ సందడి చేశారు. డైరెక్టర్ గా పూరీ, నిర్మాతగా ఛార్మీ కాంబోలో వచ్చే సినిమాల పనులతోనే కాదు.. ఎక్కిడికెళ్లినా జంటగానే వెళ్తున్నారు.. వస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ జంట హడావిడీ తగ్గేదే లే అన్నట్టు రెచ్చిపోతుంది. సినిమా లోకేషన్స్ సెర్చింగ్ నుంచి ప్రమోషన్స్ వరకు కలిసే కనిపిస్తున్నారు. ప్రైవేట్ పార్టీల్లో కలిసే ఎంజాయ్ చేస్తున్నారు.

Liger: ‘లైగర్’ గ్లింప్స్ ఇదిగో..! ఇరగదీసిన పూరీ-రౌడీ!

పూరీ, ఛార్మీలకు తోడు విజయ్ దేవరకొండ యాడ్ అయ్యాడు. క్రేజీ లైగర్ బ్యాచ్ గా లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారు వీళ్లు. లైగర్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ ప్రమోషన్స్ తో పాటూ, ముంబైలో ఎక్కువగా రచ్చ చేస్తోన్న టాలీవుడ్ బ్యాచ్ గా వీళ్లకు పేరొచ్చింది. పూరీతో ఎంత జోవియల్ గా కనిపిస్తుందో విజయ్ విషయంలోనూ ఛార్మీ అంతే ఫన్ రైడ్ చేస్తోంది. అందుకే లైగర్ తర్వాత వెంటనే ఈ కాంబినేషన్ మళ్లీ సెట్స్ పైకెళ్లబోతుంది. జనగణమనను స్టార్ట్ చేయబోతుంది.

Liger: సోషల్ మీడియాను షేక్ చేసిన లైగర్.. అల్ ఇండియా రికార్డ్!

పూరీ తన లైఫ్ లో ఎంత ఇంపార్టెంటో ఛార్మీ చాలాసార్లు చెప్పింది. తన కోసం ఛార్మీ పడే కష్టం గురించి పూరీ కూడా ఎన్నోసార్లు ప్రసావించాడు. వీళ్లిద్దరి కాంబో గురించి విజయ్ దేవరకొండ కూడా ఆమధ్య రొమాంటిక్ ఈవెంట్ లో ప్రకటించాడు. వీళ్లు ముగ్గురు కలిసి ఇండియాను షేక్ చేయడమే లక్ష్యంగా లైగర్ ను తీసుకొస్తున్నామని రౌడీబాయ్ రచ్చ చేశాడు. సో ఇలా ఒకరికి ఒకరు.. ఇద్దరికి మరొకకు యాడ్ అయి యే దోస్తీ హమ్ నహీ తోడేంగే అని సాంగ్ వేసుకుంటున్నారు.