Minister Harish Rao: అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు.. తెలంగాణ ప్రజల చైతన్య దీపిక

దేశంలోనే అతిపెద్ద 125అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ప్రారంభించుకుంటున్నామని, అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని మంత్రి హరీష్‌రావు చెప్పారు.

Minister Harish Rao: అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు.. తెలంగాణ ప్రజల చైతన్య దీపిక

Minister Harish Rao

Minister Harish Rao: హైదరాబాద్‌ (Hyderabad) లో నిర్మాణం చేసిన దేశంలోనే అతిపెద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం (Ambedkar Statue) ఆకారానికి ప్రతీక కాదని, తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని తెలంగాణ మంత్రి  హరీష్‌రావు (Minister Harish Rao) అన్నారు. అంబేద్కర్ 132వ జయంతి (Ambedkar 132nd birth anniversary) ని పురస్కరించుకొని సిద్ధిపేట జిల్లా (Siddipet District) కేంద్రంలోని పాత బస్టాండ్ వద్దగల అంబేద్కర్ విగ్రహం‌కు మంత్రి హరీష్ రావు పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలిపారు. అంబేద్కర్ ముందుచూపు వల్ల దేశంలో తెలంగాణ అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని అన్నారు. దళితులు, గిరిజనుల కోసం ముఖ్యమంత్రి ఎన్నో పథకాలు తెచ్చారని హరీష్ రావు తెలిపారు.

Harish Rao : ఏపీ మంత్రులకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ .. ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిదికాదంటూ చురకలు

అన్ని గురుకుల పాఠశాలలను పదవ తరగతి నుండి ఇంటర్ మీడియట్ వరకు పొడిగించారని అన్నారు. దళిత జాతి అభివృద్ధి‌కోసం దళిత బంధు తెచ్చి కేసీఆర్ సాహొసోపెతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. అంబేద్కర్ ఓవరసీస్ స్కాలర్ షిప్ ప్రారంభించారని, విద్య చాలా ముఖ్యమైనదని, ఈ విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వెయ్యి‌కి పైగా గురుకులాలు ప్రారంభించారని హరీష్ రావు తెలిపారు.

Ambedkar Statue : దేశంలోనే ఎత్తైన అంబేద్కర్ విగ్రహం.. ఎన్నో ప్రత్యేకలు.. మహనీయుని జీవిత విశేషాలు తెలిపేలా అరుదైన చిత్రాలు

దేశంలోనే అతిపెద్ద 125అడుగుల అంబేద్కర్ విగ్రహం ప్రారంభించుకుంటున్నామని, సచివాలయం‌లో నుండి చూస్తే ఒకవైపు అమరవీరుల స్థూపం, మరోవైపు అంబేద్కర్ విగ్రహం కనబడుతుందని అన్నారు. అది అంబేద్కర్ విగ్రహం కాదు విప్లవ రూపమని, అంబేద్కర్ విగ్రహం ఆకారానికి ప్రతీక కాదు తెలంగాణ ప్రజల చైతన్య దీపిక అని హరీష్ రావు చెప్పారు. ఇంకా దళితులకు జరగవలసినది చాలా ఉందని, దళిత, గిరిజనుల అభ్యున్నతి‌కోసం రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా కృషి చేస్తుందని అన్నారు. కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణ అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతుందని, ప్రస్తుతం దేశమంతా హైదరాబాద్ వైపు చూస్తుందని హరీష్ పేర్కొన్నారు.