Harish Rao : ఏపీ మంత్రులకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ .. ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిదికాదంటూ చురకలు

ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు.

Harish Rao : ఏపీ మంత్రులకు మంత్రి హరీష్‌రావు కౌంటర్ .. ఎక్కువగా మాట్లాడితే మీకే మంచిదికాదంటూ చురకలు

Harish Rao counter to AP ministers

Harish Rao : ఏపీ మంత్రులకు మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణలో ఏముందని ప్రశ్నించిన ఏపీ మంత్రి ఇక్కడికి వచ్చి చూస్తే ఏముందో తెలుస్తుందన్నారు. తెలంగాణలో 56 లక్షల ఎకరాల్లో యాసంగి పంట ఉంది. బోరు బావుల వద్ద 24 గంటల కరెంటు ఉంది. కేసీఆర్ కిట్ ఉంది. కళ్యాణ లక్ష్మి ఉంది. ఎకరానికి పదివేలు ఇచ్చే రైతు బంధు, రైతు బీమా ఉందని మరి ఏపీలో ఏముంది? అంటూ ఎద్దేవా చేవారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా గురించి ప్రభుత్వ కేంద్రాన్ని ప్రశ్నించదని సెటైర్ వేశారు హరీశ్ రావు. కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోతే ఎవరూ మాట్లాడటం లేదని ప్రశ్నించే ధైర్యం కూడా లేదన్నారు. విశాఖ ఉక్కు ను తుక్కు కింద పెట్టినా ప్రభుత్వం నోరు విప్పి ఖండించదు ప్రశ్నించదని అన్నారు.అధికార పార్టీ అడగదు ప్రతి పక్షం ప్రశ్నించదన్నారు.రెండు పార్టీలు జనాన్ని గాలికి వదిలేసి స్వార్థం కోసం పని చేస్తున్నాయని విమర్శించారు.అనవసరంగా మా జోలికి రాకండి, మా గురించి ఎక్కువ మాట్లాడకండి అంటూ హెచ్చరించారు మంత్రి హరీశ్ రావు.

కాగా.. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన క్రమంలో ఇక దేశ వ్యాప్తంగా విస్తరించాలని సీఎం కేసీఆర్(KCR) ప్లాన్లు వేస్తున్నారు. వివిధ రాష్ట్రాల్లో సభలు పెట్టటం.. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. దీంట్లో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో కూడా బీఆర్ఎస్ కాలుమోపాలని ఇంకా చెప్పాలంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తోంది. దీంట్లో భాగంగా ఏపీలో జరిగిన అభివృద్ధిని, తెలంగాణ(Telangana)లో జరిగిన అభివృద్ధితో అనుక్షణం పోలుస్తు తెలంగాణ మంత్రులు విమర్శలు చేస్తున్నారు. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య ఆసక్తికర పరిణామాలకు దారితీస్తున్నాయి.

తాజాగా మంత్రి హరీష్ రావు(Harish Rao) ఏపీ అభివృద్ది గురించి.. ముఖ్యంగా రోడ్లు పరిస్థితుల గురించి చేసిన వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు ప్రతివిమర్శలు చేస్తున్నారు. ఆంధ్రాలో ఓటు హక్కు రద్దు చేసుకుని తెలంగాణలో నివసించే వారంతా తెలంగాణలోనే ఓటు హక్కు నమోదు చేసుకోవాలని హరీశ్ రావు అన్నారు. ఏపీ కంటే తెలంగాణ బెటర్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు విమర్శలు చేస్తున్నారు తెలంగాణలో ఏముందని ఏపీనుంచి వెళ్లాలి? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ మంత్రులు అనవసరపు వ్యాఖ్యలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు (karumuri nageswara rao).

Also Read: మెట్రో రైల్ ప్రయాణికులకు భారీ షాక్.. రోజులో ఆరు గంటలు మాత్రమే రాయితీ..

అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh), తెలంగాణ మధ్య రాజకీయ దుమారం రేపుతోంది. రాజకీయంగా హీట్ పుట్టిన్న విశాఖ స్టీల్ ప్లాంట్ తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు పెడుతోంది. రాష్ట్ర విభజన ఉద్యమాల సమయంలో ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య..రాజకీయ నేతలమధ్యా ఎటువంటి పరిస్థితి ఉండేదో ఇప్పుడు దాదాపు అదే పరిస్థితి వచ్చినట్లుగా కనిపిస్తోంది. విశాఖ స్టీల్(Vizag Steel) ప్లాంట్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ బిడ్డింగ్‌లో పాల్గొనాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయంపై ఏపీ మంత్రులు తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ప్రైవేటీకరణ వ్యతిరేకించామని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు బిడ్ ఎలా వేస్తారు? దీనిపై క్లారిటీ ఇవ్వాలని రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటువంటి చర్యలకు పాల్పడుతోందంటూ విమర్శిస్తున్నారు. ఇలా ఏపీ, తెలంగాణ  నాయకుల మధ్య విమర్శలు ప్రతి విమర్శలు పెరుగుతున్నాయి.