Minister KTR :తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం

తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో డ్రిల్ మెక్ కంపెనీతో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో పాల్గ

Minister KTR :తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తాం

IT Minister KTR

Minister KTR :  తెలంగాణ ప్రజల హక్కులు, డిమాండ్ల కోసం కేంద్రంపై పోరాటం చేస్తామని పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు ఆయన హైదరాబాద్ లో డ్రిల్ మెక్ కంపెనీతో జరిగిన ఎంవోయూ కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ గడిచిన ఏడున్నరేళ్లలో కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సహాయ, సహకారాలు లేవని ఆయన తెలిపారు.

రేపు ప్రవేశపెట్టే బడ్జెట్‌లో ఆయినా రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు.  తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమలకు   ప్రాధాన్యం ఇవ్వాలని..తెలంగాణ, ఆంధప్రదేశ్ లకు   స్పెషల్ ఇండస్ట్రియల్ రాయితీలు అందించాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తెలంగాణలో నిర్మించతలపెట్టిన కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్,  ఫార్మా సిటీకి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు ఇప్పటికి రాలేదని మంత్రి వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మోదీ పదే పదే సబ్ కా సాత్… సబ్ కా వికాస్ అంటున్నారని….రాష్ట్రాలకు నిధులు విధుల్చకపోతే సబ్ కా వికాస్  ఎలా సాధ్యమవుతుందని మంత్రి ప్రశ్నించారు.

భారతదేశంలో నాలుగు పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని… కేంద్రం సహరిస్తే వేలాది మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని కేటీఆర్ అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్ర సహకారం అవసరం ఉందని కేటీఆర్ చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంచుకున్నందుకు డ్రిల్ మేక్ సంస్థకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

డ్రిల్ మేక్ సంస్ధ తెలంగాణలో 10,500 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనుంది. దీని ద్వారా 2,500 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని తెలుస్తోంది. ఈరోజు  జరిగిన ఎంవోయూలో పురపాలక ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, డ్రిల్ మెక్ సీ ఈ ఓ సిమోన్ ట్రివిసాని పలువురు రాష్ట్ర ఫ్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.
Also Read : Assembly Elections : ఎన్నికల ప్రచార ర్యాలీలపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం
తెలంగాణ కేంద్రంగా భారీ ఆయిల్ రిగ్గులను డ్రిల్ మెక్ సంస్ధ తయారు చేయనుంది. ఆయిల్ రిగ్గుల తయారీలో అంతర్జాతీయ సంసస్ధగా డ్రిల్ మెక్ కు పేరుంది.  ప్రస్తుతం డ్రిల్ మెక్ సంస్ధ ఏడాదికి 200 మిలియన్ యూఎస్ డాలర్ల టర్నోవర్ కలిగి ఉంది. మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) కి డ్రిల్‌మెక్‌ అనుబంధ సంస్థ.