Minister Srinivas Goud : ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికి.. దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. తెలంగాణ

Minister Srinivas Goud : ధాన్యం కొనుగోళ్లలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానం : మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud

Updated On : June 2, 2023 / 11:14 AM IST

Telangana first rank : రాష్ట్ర సాధన కోసం సాగిన ఉద్యమంలో పాలుపంచుకున్న అందరికీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ శుభాభివందనాలు తెలిపారు. ప్రాణాలు త్యాగం చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నామని పేర్కొన్నారు. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలో తెలంగాణ స్ధిరమైన ఆర్థిక ప్రగతితో సుసంపన్నమైన రాష్ట్రంగా అవతరించిందని కొనియాడారు.

తలసరి విద్యుత్ వినియోగంలో రాష్ట్రం అగ్ర స్థానంలో ఉందన్నారు. ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఎన్నో ఫ్రభుత్వ సంక్షేమ పథకాలతో ప్రజల ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత రాష్ట్ర ఫ్రభుత్వానిదన్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ పథకాలకు దేశ విదేశాల నుండి ప్రశంసలు అందుతున్నాయని వెల్లడించారు.

Mayawati: కాంగ్రెస్ ‘ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్’ పథకాలపై విరుచుకుపడ్డ బీఎస్పీ చీఫ్ మాయావతి

దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని ఎన్నో కార్యక్రమాలకు నాంది పలికి.. దేశానికే ఆదర్శప్రాయంగా నిలిచిందన్నారు. తెలంగాణ అనుసరిస్తుంది – దేశం ఆచరిస్తుంది…అని చెప్పకునే స్థాయికి చేరుకుందని.. ఇది అందరికీ గర్వ కారణమని పేర్కొన్నారు. దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా నీతి అయోగ్ నివేదికలో పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి ప్రతి సంవత్సరం రాష్ట్ర GSDP వృద్ధి రేటు దేశ వృద్ధి రేటు కంటే ఎక్కువగానే ఉందన్నారు. కరువు పీడిత ప్రాంతంగా, వలసల జిల్లాగా పేరొందిన పాలమూరు నేడు పచ్చని పంటలకు నెలవు అయిందని తెలిపారు. పాలమూరులో దొరికే వ్యవసాయ పనుల కోసం పక్క రాష్ట్రాల రైతు కూలీలు వలసలు వస్తున్నారంటే.. మార్పును మనం గమనించవచ్చన్నారు.

Plant Water Stress : నీరు లేకున్నా జీవించే మొక్కలు.. పశ్చిమ కనుమల్లో 62 జాతుల మొక్కలు గుర్తింపు

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత వ్యవసాయ రంగానికి తెలంగాణ ఫ్రభుత్వం లక్షా 91 వేల 612 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని తెలిపారు. రైతన్నకు కరెంటు చార్జీలు లేకుండా, పన్నులు లేకుండా సాగునీటిని అందిస్తున్న ఒకే ఒక్క రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. రెవెన్యూ శాఖలో ధరణి ద్వారా సమూల మార్పులతో రాష్ట్రంలో భూ వివాదాలను కనీస స్థాయికి తీసుకొచ్చామని తెలిపారు.