Vishwak Sen : విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకుంటాం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు..

తాజాగా ఆ యాంకర్ ఈ విషయంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఫిర్యాదు చేసింది. దీంతో తలసాని మాట్లాడుతూ విశ్వక్‌సేన్‌ పై...........

Vishwak Sen : విశ్వక్‌సేన్‌పై చర్యలు తీసుకుంటాం.. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వ్యాఖ్యలు..

Vishwak

Vishwak Sen :  గత మూడు రోజులుగా విశ్వక్‌సేన్‌ వార్తల్లో నిలుస్తున్నాడు. త్వరలో రిలీజ్ కానున్న తన సినిమా ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ని ప్రమోట్ చేస్తూ ఇటీవల రోడ్ మీద ఓ ప్రాంక్ వీడియో చేశాడు. ఈ వీడియోని నడిరోడ్డు మీద చేయడం, దానిని నెటిజన్స్, పబ్లిక్ ట్రోల్ చేయడం, రోడ్ మీద జనాల్ని ఇబ్బంది పెట్టడంతో విశ్వక్‌సేన్‌ ని విమర్శించడం లాంటివి చేశారు. ఆ తర్వాత విశ్వక్‌సేన్‌ పై హెచ్చార్సీకి ఫిర్యాదు కూడా చేశారు. అయితే ఇదే విషయంపై చర్చించడానికి ఓ న్యూస్ ఛానల్ విశ్వక్‌సేన్‌ ని ఛానల్ కి పిలవగా ఆ డిబేట్ గొడవగా మారి యాంకర్, హీరో ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేశారు.

అయితే ఇలా మాట్లాడుతూ హీరో ఓ అసభ్యకరమైన పదంతో యాంకర్ ని దూషించాడు. దీంతో ఇది మరింత పెద్ద ఇష్యూ గా మారింది. ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ లో ఏదో ఫార్మాలిటీగా ప్రెస్ వాళ్ళు అడిగితే అనుకోకుండా అనేశాను అని సారీ చెప్పాడు. తాజాగా ఆ యాంకర్ ఈ విషయంపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కి ఫిర్యాదు చేసింది. దీంతో తలసాని మాట్లాడుతూ విశ్వక్‌సేన్‌ పై చర్యలు తీసుకుంటామని మీడియాతో తెలిపారు.

Sekhar Master : ఎన్టీఆర్ రిహార్సిల్‌కి రారు.. ఎన్టీఆర్ డ్యాన్స్‌పై శేఖర్ మాస్టర్ వ్యాఖ్యలు..

తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. ”సినిమాని ప్రమోషన్ చేయడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. విశ్వక్ సేన్ అది తెలుసుకోకుండా ప్రమోషన్ పేరుతో రోడ్డు పైన అందర్నీ డిస్ట్రబ్ చేయడం కరెక్ట్ కాదు. విశ్వక్‌సేన్‌, యాంకర్ కి మధ్య జరిగిన డిబేట్‌ నేను చూశాను. అక్కడ అతని బిహేవియర్ సరిగ్గా లేదు. ఓ ఆడపిల్లని ఇలా అసభ్యకరమైన పదంతో అవమానించడం కరెక్ట్ కాదు. మ‌న కుటుంబంలోనూ త‌ల్లి, భార్య‌, పిల్ల‌లుంటారు, వారిని కూడా ఇలాగే అంటామా?. విశ్వక్‌సేన్‌ పై ఫిల్మ్ డెవ‌ల‌ప్‌మెంట్ కార్పొరేషన్, పోలీస్ డిపార్ట్‌మెంట్ వారు చర్యలు తీసుకునేలా నేను మాట్లాడతాను. క్ష‌మాప‌ణ చెప్పే ప‌ద్ధ‌తులు కూడా వేరేగా ఉంటాయి. సినిమా ప్రెస్ మీట్లో ఏదో లైట్‌గా తీసుకొని, ఫార్మాలిటీగా సారీ చెప్పినట్లు చెప్పడం క‌రెక్ట్ కాదు. మ‌హిళ‌లకు గౌర‌వం ఇవ్వ‌కుండా ఇలా మాట్లాడటం చాలా బాధాక‌ర‌మైన విష‌యం’’ అని అన్నారు. మరి ఈ ఇష్యూ ఇంకెక్కడి వరకు వెళ్తుందో చూడాలి.