Sekhar Master : ఎన్టీఆర్ రిహార్సిల్‌కి రారు.. ఎన్టీఆర్ డ్యాన్స్‌పై శేఖర్ మాస్టర్ వ్యాఖ్యలు..

శేఖర్ మాస్టర్, ఎన్టీఆర్ చేసిన చాలా పాటలు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ''ఎన్టీఆర్ సర్ తో నేను చాలా పాటలకి........

Sekhar Master : ఎన్టీఆర్ రిహార్సిల్‌కి రారు.. ఎన్టీఆర్ డ్యాన్స్‌పై శేఖర్ మాస్టర్ వ్యాఖ్యలు..

Sekhar Master (1)

 

Sekhar Master :  మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకి పని చేసిన వాళ్లంతా స్పెషల్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఇప్పటికే తమన్, కీర్తి సురేష్, అనంత శ్రీరామ్, డైరెక్టర్ పరుశురాం ఇంటర్వ్యూలు ఇవ్వగా తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమా తరపున ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో శేఖర్ మాస్టర్ ఎన్టీఆర్ డాన్స్ గురించి మాట్లాడారు.

Sekhar Master : మహేష్ నుంచి మరో మాస్ సాంగ్ రాబోతుంది.. డ్యాన్స్ అదరగొట్టేస్తారు..

శేఖర్ మాస్టర్, ఎన్టీఆర్ చేసిన చాలా పాటలు కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు. ఈ ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ గురించి మాట్లాడుతూ.. ”ఎన్టీఆర్ సర్ తో నేను చాలా పాటలకి వర్క్ చేశాను. ఆయన డ్యాన్స్ లో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. ఎన్టీఆర్ సర్ ఎప్పుడు రిహార్సిల్స్ కి రారు. డైరెక్ట్ గా సెట్ కి వచ్చేస్తారు. షూట్ లో స్టెప్ ఒక్కసారి చేసి చూపిస్తే అర్ధం చేసేసుకొని చేసేస్తారు. ఎలాంటి కష్టమైన స్టెప్ అయినా ఇట్టే పట్టేస్తారు. చాలా ఈజీగా డ్యాన్స్ చేసేస్తారు ఎన్టీఆర్. అందుకే ఆయన రిహార్సిల్స్ కి రారు, రావాల్సిన అవసరం కూడా లేదు” అని తెలిపారు.