Sekhar Master : మహేష్ నుంచి మరో మాస్ సాంగ్ రాబోతుంది.. డ్యాన్స్ అదరగొట్టేస్తారు..

శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ''నేను ఈ సినిమాలో మూడు పాటలు చేశాను. కళావతి, పెన్నీ సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. కళావతి సాంగ్, స్టెప్స్ రెండూ కూడా..........

Sekhar Master : మహేష్ నుంచి మరో మాస్ సాంగ్ రాబోతుంది.. డ్యాన్స్ అదరగొట్టేస్తారు..

Sekhar Master

 

Sekhar Master :  సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా డైరెక్టర్ పరుశురాం తెరకెక్కిస్తున్న సినిమా ‘సర్కారు వారి పాట’ షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ లో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు పాటలు రిలీజ్ అయి భారీ విజయాన్ని సాధించాయి. ఇక ట్రైలర్ అయితే అభిమానులకి, ప్రేక్షకులకి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. సినిమా కోసం అంతా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. సర్కారు వారి పాట సినిమా మే 12న రిలీజ్ అవుతుండటంతో ప్రమోషన్స్ అప్పుడే మొదలు పెట్టేశారు. ఇప్పటికే తమన్, కీర్తి సురేష్, గేయ రచయిత అనంత శ్రీరామ్, డైరెక్టర్ పరుశురాం ఇంటర్వ్యూలు ఇవ్వగా తాజాగా కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చారు.

Fake Movie Tickets : నకిలీ సినిమా టికెట్ల దందా.. పెద్ద హీరోల సినిమాలొస్తే పండగే..

 

ఇందులో శేఖర్ మాస్టర్ మాట్లాడుతూ.. ”నేను ఈ సినిమాలో మూడు పాటలు చేశాను. కళావతి, పెన్నీ సాంగ్స్ ఇప్పటికే రిలీజ్ అయి మంచి విజయం సాధించాయి. కళావతి సాంగ్, స్టెప్స్ రెండూ కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇందులో ఇంకో మాస్ సాంగ్ కూడా చేశాను. అది త్వరలోనే రిలీజ్ అవుతుంది. అది ఇంకా బాగా హిట్ అవుతుంది. అభిమానులకి బాగా నచ్చుతుంది ఆ సాంగ్. ఆ సాంగ్ లో మహేష్ గారి స్వాగ్ అండ్ మాస్ రెండూ చూస్తారు. ఇందులో స్టెప్స్ వేరే లెవెల్ లో ఉంటాయి. మహేష్ గారికి సరిలేరు నీకెవ్వరులో చేసిన సాంగ్స్ కూడా మంచి విజయం సాధించాయి. మహేష్ బాబు డ్యాన్స్ చాలా త్వరగా నేర్చుకుంటారు. ఆయన బాడీ లాంగ్వేజ్ ని అర్ధం చేసుకుంటే చాలు. ఆయనకి ఈజీగా స్టెప్స్ కంపోజ్ చేయొచ్చు” అని తెలిపారు.