మిథాలీ ఖాతాలో అరుదైన రికార్డు..

మిథాలీ ఖాతాలో అరుదైన రికార్డు..

Champion Cricketer

భారత మహిళా జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. టీమిండియా తరఫున 10వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకుంది. ఈ రికార్డు క్రియేట్ చేసిన తొలి మహిళా క్రికెటర్‌గా మిథాలీ రాజ్ నిలిచింది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో మిథాలీ రాజ్ ఈ అరుదైన రికార్డును కైవసం చేసుకుంది.

భారత వన్డే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న 38 ఏళ్ల మిథాలీ, దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో వన్డేలో భారత ఇన్నింగ్స్ 28 వ ఓవర్లో అన్నే బాష్ ఓవర్‌లో బౌండరీ ద్వారా మిథాలీ ఈ ఘనత సాధించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో 10 వేల పరుగులు పూర్తిచేసుకోగా.. ఈ ఘనత సాధించిన తొలి భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.. ఓవరాల్‌గా మాత్రం రెండో క్రికెటర్‌

ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ ఛార్లెట్ ఎడ్వర్డ్స్ 309 మ్యాచ్‌లలో 10,273 పరుగులు చేసి అగ్రస్థానంలో ఉంది. మిథాలీ రాజ్ 212 వన్డేలలో 6938 పరుగులు సాధించింది. 89 టీ20 మ్యాచ్‌లలో టీమిండియాకు ప్రాతినిథ్యం వహించి 2,364 పరుగులు చేసింది. 10 టెస్టులలో 663 పరుగులు చేసింది. అన్ని ఫార్మాట్లలో కలిపి 10 వేల పరుగుల మార్క్ చేరుకుంది.