Mumbai City: కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే

కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడు. పనుల్లో లోపాలు ఉన్నాయంటూ కాంట్రాక్టర్ ని పిలిపించి అతడిపై చెత్త వేయించాడు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది.

Mumbai City: కాంట్రాక్టర్ పై చెత్త వేయించిన ఎమ్మెల్యే

Mumbai City

Updated On : June 13, 2021 / 2:55 PM IST

Mumbai City: కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే అనుచితంగా ప్రవర్తించాడు. పనుల్లో లోపాలు ఉన్నాయంటూ కాంట్రాక్టర్ ని పిలిపించి అతడిపై చెత్త వేయించాడు శివసేన ఎమ్మెల్యే దిలీప్ లాండే.. ఈ ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ముంబైలో గత కొద్దీ రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లపై నీరు ప్రవహిస్తుంది. డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో నీరు మొత్తం రోడ్లపైకి వస్తుంది. నీరు భారీగా రోడ్లపై చేరడంతో ఆ ప్రాంతంలో పారిశ్యుద్య పనులు నిర్వహించే కాంట్రాక్టర్ పిలిపించాడు ఎమ్మెల్యే.

కాంట్రాక్టర్ ఎమ్మెల్యే దిలీప్ లాండే చెప్పిన ప్రదేశానికి రాగానే అతడిని బురద నీటిలో కూర్చోబెట్టి శివసేన కార్యకర్తలతో అతడిపై చెత్త వేయించాడు. వర్షం భారీగా కురవడం వల్లనే ఇలా జరిగిందని కాంట్రాక్టర్ వారించినా ఎమ్మెల్యే వినలేదు. అయితే ఈ దృశ్యాలను అక్కడ ఉన్నవారు తమ కెమెరాల్లో బంధించారు.

దానిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. కాగా ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీనిపై ఇతర పార్టీల నేతలతో పాటు, పారిశ్యుద్య కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధి అయి ఉండి నడి రోడ్డుపై ఓ కాంట్రాక్టర్ ను ఇలా అవమానించడం తగదని అభిప్రాయపడుతున్నారు.