BRS Party: బోధన్ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. ఎమ్మెల్యే, మునిసిపల్ ఛైర్‌పర్సన్ మధ్య ఫ్లెక్సీల వార్

మునిసిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ తీరుపై ఎమ్మెల్యే షకీల్ అనుచరులు మండిపడుతున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించబోమని చెప్పారు.

BRS Party: బోధన్ బీఆర్‌ఎస్‌లో వర్గపోరు.. ఎమ్మెల్యే, మునిసిపల్ ఛైర్‌పర్సన్ మధ్య ఫ్లెక్సీల వార్

BRS Party

BRS Party: నిజామాబాద్ జిల్లాలోని బోధన్ లో బీఆర్ఎస్ (BRS Party)లో వర్గ పోరు రాజుకుంది. ఎమ్మెల్యే షకీల్ (MLA Shakeel), మునిసిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ మధ్య ఫ్లెక్సీల వార్ జరుగుతోంది. పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకున్నారు. ఎమ్మెల్యే అనుచరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో మునిసిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ ఫొటో కనపడలేదు. అలాగే, మునిసిపల్ ఛైర్‌పర్సన్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే ఫొటో లేదు.

మునిసిపల్ ఛైర్‌పర్సన్ తూము పద్మ తీరుపై ఎమ్మెల్యే షకీల్ అనుచరులు మండిపడుతున్నారు. ప్రొటోకాల్ పాటించకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే సహించబోమని చెప్పారు. మునిసిపల్ ఛైర్‌పర్సన్ పద్ధతిని మార్చుకోవాలని షకీల్ అనుచరులు అన్నారు. దీంతో, అభిమానం ఉన్న నాయకుల ఫొటోలు ఫ్లెక్సీల్లో వేస్తామని మునిసిపల్ ఛైర్‌పర్సన్ పద్మ భర్త తూము శరత్ రెడ్డి చెప్పారు.

బోధన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే మాట వినని వారిపై బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. అక్రమ కేసులు బనాయిస్తున్నారని మునిసిపల్ ఛైర్‌పర్సన్ పద్మ భర్త తూము శరత్ రెడ్డి ఆరోపించారు.

పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడానికి వస్తే ఏసీపీ తనను బెదిరించారని శరత్ రెడ్డి చెప్పారు. “నువ్వు నా టార్గెట్ లోకి వచ్చావు” అని అన్నారని వివరించారు. ఫ్లెక్సీల ఏర్పాటులో ఛైర్‌పర్సన్ ఫొటో పెట్టకుండా అవమానించారని తెలిపారు. వారు తమ ఫొటో పెట్టలేదు కాబట్టి.. తాము కూడా వాళ్ల ఫొటో పెట్టబోమని అన్నారు.

TS SSC leak Case: తెలంగాణ హైకోర్టులో విచారణ.. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరిన ఏజీ