TS SSC leak Case: తెలంగాణ హైకోర్టులో విచారణ.. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరిన ఏజీ

అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని ఏజీకి హైకోర్టు సూచించింది. బండి సంజయ్ పోలీసులకు మొబైల్ సమర్పించలేదని కోర్టుకు ఏజీ తెలిపారు.

TS SSC leak Case: తెలంగాణ హైకోర్టులో విచారణ.. బండి సంజయ్ బెయిల్ రద్దు చేయాలని కోరిన ఏజీ

TS SSC leak Case

Updated On : April 10, 2023 / 7:19 PM IST

TS SSC leak Case: తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు(TS SSC leak Case) లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) రిమాండ్ ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. హైకోర్టులో ఏజీ ప్రసాద్ వాదనలు వినిపించారు. బండి సంజయ్ పోలీసుల విచారణకు సహకరించడం లేదని కోర్టుకు తెలిపారు.

రిమాండ్ మీద విచారణ అవసరం లేదని వాదించారు. బండి సంజయ్ కి బెయిల్ మంజూరు అయిందని గుర్తుచేశారు. పోలీసుల విచారణకు సహకరించడం లేదని ఆయన బెయిల్ రద్దు చేయాలని ఏజీ కోరారు. అఫిడవిట్ దాఖలు చేసుకోవాలని హైకోర్టు సూచించింది. బండి సంజయ్ పోలీసులకు మొబైల్ సమర్పించలేదని కోర్టుకు ఏజీ తెలిపారు.

రిమాండ్ చట్టబద్ధం కాదని, ఈ విషయంపై వాదనలు వినిపిస్తామని కోర్టుకు బండి సంజయ్ తరఫు న్యాయవాది చెప్పారు. తదుపరి విచారణను హైకోర్టు ఏప్రిల్ 21కి వాయిదా వేసింది. మరోవైపు, తెలంగాణలో పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఇవాళ వరంగల్ కమిషనర్ కార్యాలయంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన ఫోనుతో విచారణకు హాజరయ్యారు.

పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ కేసు అంతా ఓ కుట్ర అని అన్నారు. తన ఫోను మాత్రం పోయిందని బండి సంజయ్ అంటున్నారు. ఈ మేరకు ఇప్పటికే పోలీసులకు కరీం నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆన్ లైన్ ద్వారా ఫిర్యాదు చేశారు. తన ఫోనును ఎలాగైనా వెతికి పెట్టాలని కోరారు.

TS SSC leak Case: ఫోనుతో విచారణకు హాజరైన ఈటల.. ఈ ప్రశ్నలు అడిగారని వెల్లడి