Mobile Data Speed in India : గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ మొబైల్ డేటా స్పీడ్ పెరిగిందోచ్.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Mobile Data Speed in India : ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత మొబైల్ డేటా స్పీడ్ గణనీయంగా పెరిగింది. అత్యంత వేగవంతమైన మధ్యస్థ మొబైల్ స్పీడ్‌లను అందించే గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది.

Mobile Data Speed in India : గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ మొబైల్ డేటా స్పీడ్ పెరిగిందోచ్.. ఎంతో తెలిస్తే షాకవుతారు..!

Mobile Data Speed in India _ Mobile data speed increases in India, currently fastest in Qatar

Mobile Data Speed in India : ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత మొబైల్ డేటా స్పీడ్ గణనీయంగా పెరిగింది. అత్యంత వేగవంతమైన మధ్యస్థ మొబైల్ స్పీడ్‌లను అందించే గ్లోబల్ ర్యాంకింగ్‌లో భారత్ తన ర్యాంకును మెరుగుపర్చుకుంది. ఊక్లా స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ (Ookla Speedtest Global Index report) లేటెస్ట్ రిపోర్టు ప్రకారం.. మధ్యస్థ మొబైల్ స్పీడ్‌ ప్రపంచ ర్యాంకింగ్‌లో భారత్ 8 స్థానాలు ఎగబాకింది. గత నవంబర్‌లో భారత్ 18.26 Mbps మధ్యస్థ మొబైల్ డౌన్‌లోడ్ స్పీడ్‌లను నమోదు చేసింది.

అక్టోబర్‌‌లో భారత్ మొబైల్ డేటా స్పీడ్ 16.50 Mbps వేగంతో పోలిస్తే చాలా మెరుగ్గా ఉంది. నవంబర్‌లో మధ్యస్థ మొబైల్ స్పీడ్‌ల గ్లోబల్ ర్యాంకింగ్ ఇండెక్స్‌లో భారత్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 113 నుంచి 105కి చేరుకుంది. అయితే, మొత్తం మధ్యస్థ స్థిర బ్రాడ్‌బ్యాండ్ వేగం (BroadBand Speed)లో భారత్ ర్యాంకింగ్ ప్రపంచవ్యాప్తంగా పడిపోయింది.

ఫిక్స్‌డ్ బ్రాడ్‌బ్యాండ్ వేగం (Fixed BroadBand Speed)లో భారత్ 79వ ర్యాంక్‌లో ఉంది. కానీ, నవంబర్‌లో 80వ స్థానానికి పడిపోయింది. ఈ సమయంలో భారత్ స్థిర మధ్యస్థ డౌన్‌లోడ్ స్పీడ్ అక్టోబర్‌లో 48.78 నుంచి నవంబర్‌లో 49.09 Mbpsకి స్వల్పంగా పెరిగింది. నవంబర్ నాటి స్పీడ్‌టెస్ట్ గ్లోబల్ ఇండెక్స్ రిపోర్ట్ ప్రకారం..176.18Mbps రికార్డెడ్ స్పీడ్‌తో గ్లోబల్ మీడియన్ మొబైల్ స్పీడ్ ర్యాంకింగ్‌లో ప్రస్తుతం ఖతార్ అగ్రస్థానంలో ఉందని వెల్లడించింది.

Mobile Data Speed in India _ Mobile data speed increases in India, currently fastest in Qatar

Mobile Data Speed in India _ Mobile data speed increases in India

స్టేబుల్ బ్రాడ్‌బ్యాండ్ స్పీడ్.. చిలీ అత్యధిక ఇంటర్నెట్ స్పీడ్‌ను 216.46 Mbps స్పీడ్‌తో నమోదు చేసింది. ఆ తర్వాత చైనా 214.58 Mbps ఇంటర్నెట్ స్పీడ్‌ను నమోదు చేసింది. అత్యంత వేగవంతమైన బ్రాడ్‌బ్యాండ్ వేగాన్ని అందిస్తూ చిలీ కూడా అగ్రస్థానంలో నిలిచింది. పాలస్తీనా, భూటాన్ ప్రపంచవ్యాప్తంగా ర్యాంక్‌లో 14 స్థానాలకు చేరాయి.

ముఖ్యంగా, మొబైల్ ఇంటర్నెట్ (Mobile Internedt), బ్రాడ్‌బ్యాండ్ వేగం (BroadBand Speed) ద్వారా ఇంటర్నెట్ సర్వీసులు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా విస్తరించిన మౌలిక సదుపాయాలు లేదా కేబులింగ్ టైప్ (కాపర్ లేదా ఫైబర్-ఆప్టిక్)పైనే ఎక్కువగా ఆధారపడి ఉన్నాయని చెప్పవచ్చు. ఈ లిస్టులో అధిక ర్యాంక్ ఉన్న దేశాలతో పోల్చితే.. భారత్ స్పెక్ట్రమ్ చాలా తక్కువగా ఉంది.

అదే కారణంగా, భారత్‌లో వినియోగదారులు తక్కువ ఇంటర్నెట్ స్పీడ్ అందుకుంటున్నారు. ఉదాహరణకు.. భారత్‌లో టెక్ సభ్యులలో ఒకరు దక్షిణ కొరియాను సందర్శించిన సమయంలో అక్కడ 4G స్పీడ్‌ను ఎక్కువగా రికార్డ్ చేసినట్టు తెలిపారు. భారత్‌లో కొత్త 5G స్పెక్ట్రమ్ అందిస్తున్న స్పీడ్ కు దగ్గరగా పోలి ఉందని నివేదిక తెలిపింది.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : Google For India 2022 : భారత్‌లో గూగుల్ 8వ ఎడిషన్ ఈవెంట్.. గూగుల్ పే నుంచి డిజీలాకర్ వరకు టాప్ 5 హైలెట్స్ ఇవే..!