Mother’s love : ఓ వైపు వర్షం.. కాళ్లకి చెప్పులు కూడా లేవు.. కూతుర్ని భుజాలపై మోస్తూ ఓ తల్లి సంబరం చూడండి

సృష్టిలో తల్లిదండ్రుల ప్రేమను మించినది ఏది లేదు. పిల్లల కోసం ఎన్నో కష్టాలు భరిస్తారు. తమ ఇష్టాలను కూడా త్యాగం చేస్తారు. భారీ వర్షాన్ని లెక్కచేయకుండా తన కూతుర్ని భుజాలపై మోస్తూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇంటర్నెట్ లో వైరల్ అవుతోంది.

Mother’s love : ఓ వైపు వర్షం.. కాళ్లకి చెప్పులు కూడా లేవు.. కూతుర్ని భుజాలపై మోస్తూ ఓ తల్లి సంబరం చూడండి

Mother's love

Mother and daughter in the rain : బిడ్డల్ని తల్లిదండ్రులు కంటికి రెప్పలా కాపాడుకుంటారు. అందుకోసం వారు ఎంతటి కష్టాన్నైనా భరిస్తారు. భారీవర్షంలో కాళ్లకి చెప్పులు లేకపోయినా కూతుర్ని భుజాలపై ఎత్తుకుని తీసుకెళ్తున్న ఓ తల్లి వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Mother Sentiment: సక్సెస్ ఫార్ములాగా మారిన ఎమోషన్.. తెరపైకి తల్లి ప్రేమ!

మే 14 న ప్రపంచ వ్యాప్తంగా ‘మదర్స్ డే’ సెలబ్రేట్ చేసుకున్నారు. అదే రోజు ఇంటర్నెట్‌లో కనిపించిన ఓ వీడియో అందరి మనసుల్ని హత్తుకుంది. 18 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియోని @Masterji_UPWale అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశారు. వర్షం పడుతోంది. తల్లి కూతురిని భుజాలపై మోస్తున్నట్లు ఆ వీడియోలో కనిపిస్తుంది. కూతురి చేతుల్లో గొడుగు ఉంది. చెప్పాలంటే గొడుగు పట్టుకుని కూతురిని రోడ్డుపై నడిపించవచ్చు. తన కాళ్లకు చెప్పులు లేకపోయినా కూతురితో కబుర్లు చెబుతూ నవ్వుతూ ఇంటికి తీసుకెళ్తున్న ఆ తల్లి ప్రేమ ఎంత గొప్పదో కదా.

International Mothers Day : మదర్స్ డే సెలబ్రేట్ చేయాలనే ఆలోచన అసలు ఎవరిది?

ఈ వీడియోకి ఇప్పటికే లక్షల్లో వ్యూస్ వచ్చాయి. ‘వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉందని.. ఆ తల్లి చిరునవ్వులు చూడమని’ కామెంట్లు పెడుతు నెటిజన్లు రెడ్ హార్ట్ ఎమోజీని చూపించారు. బిడ్డలు కబుర్లు చెబుతూ ఉంటే ప్రతి తల్లి తన కష్టాన్నే మర్చిపోతుంది. చిరునవ్వులు చిందిస్తుంది. అందుకు ఈ వీడియో ప్రత్యక్ష నిదర్శనం.