Punjabi Mom : పంజాబీ మదర్ అడిగిన “మదర్స్ డే” గిఫ్ట్ ఏంటో తెలుసా?

ఈ ప్రపంచంలో మన నుంచి ఏదైనా ఆశించని వ్యక్తి ఎవరు అంటే అమ్మ. "మదర్స్ డే" రోజు మన సంతోషం కోసం ఆమెకు బహుమతులు ఇస్తాము కానీ.. నిజంగా ఓ తల్లి బిడ్డల నుంచి ఎలాంటి క్రమశిక్షణ కోరుకుంటుందో తెలిపే వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.

Punjabi Mom : పంజాబీ మదర్ అడిగిన “మదర్స్ డే” గిఫ్ట్ ఏంటో తెలుసా?

Punjabi Mom

Mother’s day gift asked by a Punjabi mother : మదర్స్ డే రోజు తల్లికి శుభాకాంక్షలు చెప్పడం.. గిఫ్ట్ లు కొనివ్వడం ఇవన్నీ కామనే. అయితే ఓ పంజాబీ తల్లి మాత్రం తనకు బిడ్డల నుంచి ఎలాంటి గిఫ్ట్ కావాలని ఆశిస్తోందో చెప్పిన విధానం ఫన్నీగా అనిపించినా చాలా ఆలోచింపచేస్తోంది.

Do what mom likes : అమ్మ ఇష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

బిడ్డల నుంచి తల్లిదండ్రులు ఏదీ ఆశించరు. నిజంగా వారు కోరుకునేది ఏదైనా ఉందంటే బిడ్డలు మంచి దారిలో నడవడం.. జీవితంలో సెటిల్ అవ్వడం. మదర్స్ డే అనగానే చాలామంది తమ తల్లులకు ఏదైనా గిఫ్ట్ ప్లాన్ చేస్తారు. అయితే  పంజాబీ మదర్ సోనియా ఖత్రీ ఏం కోరుకుంటోందో వింటే ఆలోచిస్తారు. ఇన్‌స్టాగ్రామ్ యూజర్ Sonia Khatri షేర్ చేసిన వీడియోలో చమత్కారంగా చెప్పినా ఎన్నో ఆలోచించే విషయాలను షేర్ చేసింది.

 

తనకు ఎలాంటి సర్ ప్రైజ్ గిఫ్ట్ అక్కర్లేదని.. దయ చేసి నాకు నిజంగా సంతోషాన్ని ఇచ్చే పనులు చేయమని రిక్వెస్ట్ చేసింది. ఉదయం 6 గంటలకు నిద్ర లేవండి.. మధ్యాహ్నం 12 గంటలకు కాదు.. అలాగే ఇంట్లో పుడ్ తినండి.. బయట ఆహారం ఆర్డర్ చేయవద్దని కోరింది. రోజంతా సోషల్ మీడియాను ఉపయోగించవద్దని నవ్వుతూనే తన అభిప్రాయం చెప్పింది.

 

precious gift for mom : అమ్మకి ఏమి బహుమతి ఇవ్వాలి…
తల్లి పిల్లల నుంచి ఇలాంటి అంశాలను బహుమతిగా కోరుకోవడంలో ఎలాంటి తప్పు లేదని నెటిజన్లు ఆమెతో ఏకీభవించారు. “ఇది తమ పిల్లలకు వర్తిస్తుందని.. నువ్వు చెప్పింది అక్షరాల నిజం అక్కా.. అంగీకరిస్తున్నాను” అని అభిప్రాయాలు పోస్టు చేశారు. ఇటీవల కాలంలో పిల్లలు, పెద్దలు సెల్ ఫోన్ మాయలో పడి ఇంట్లో వారిని కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకే ఇంట్లో ఉన్నా ఎవరి గదుల్లో వారు.. ఎవరి ఫోన్లతో వారు అన్న చందంగా ఉంటోంది. ఈ నేపథ్యంలో సోనియా ఖత్రీ తన బిడ్డల నుంచి ఇలాంటి గిఫ్ట్ లు కోరుకోవడంలో ఏ మాత్రం తప్పు లేదనిపిస్తోంది.

 

View this post on Instagram

 

A post shared by Sonia Khatri (@_punjabimom)