Do what mom likes : అమ్మ ఇష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

అహర్నిశలు కుటుంబం కోసమే పాటుపడే అమ్మకు కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి. కటుుంబ బాధ్యతలు మోస్తూ వాటిని త్యాగం చేస్తుంది. మదర్స్ డే రోజైనా అమ్మ ఇష్టాలు తెలుసుకుని ఆమెకు సంతోషం పంచడమే పిల్లలు చేసే అందమైన సెలబ్రేషన్.

Do what mom likes : అమ్మ ఇష్టాల గురించి ఎప్పుడైనా ఆలోచించారా?

Do what mom likes

Do what mom likes : సూర్యోదయానికి ముందే అమ్మ నిద్ర లేస్తుంది. కుటుంబానికి కావాల్సిన అన్ని అవసరాలు తీరుస్తుంది. భర్త, పిల్లలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా చూసుకుంటుంది. వారి ఇష్టాలకి తగ్గట్లే అన్నీ రెడీ చేస్తుంది. మరి అమ్మకి ఇష్టమైనది ఏంటి? ఈ ఏడాది “అంతర్జాతీయ మాతృ దినోత్సవం” రోజు అమ్మకి ఇష్టమైన పని చేయండి. అదే అమ్మకు గొప్ప సెలబ్రేషన్.

Viral Video: తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన కుమారుడు

అమ్మకు విశ్రాంతి ఉండదు. నిరంతరం కుటుంబం కోసం పనిచేస్తూనే ఉంటుంది. ఫ్యామిలీని విడిచి నాలుగురోజులు తనవారి దగ్గరకు వెళ్లాలని అనిపించినా తను లేకుండా ఇంట్లో ఇబ్బంది పడతారని ఆలోచిస్తుంది. ఎన్నో ఇష్టాలను కుటుంబం కోసం త్యాగం చేస్తుంది. మదర్స్ డే రోజు అమ్మకి బాగా ఇష్టమైన స్నేహితుల్ని ఇంటికి లంచ్‌కి ఆహ్వానించండి. వీలైతే తన పుట్టింటివారిని కూడా పిలవండి. తనకి చదువు నేర్పిన ఉపాధ్యాయులతో కూడా మాట్లాడించండి. వీలు కాకపోతే వారి బైట్స్ దొరికితే చిన్న వీడియో చేసి అమ్మకి బహుమతిగా ఇవ్వండి. ఆరోజైన తన గురించి తాను ఆలోచించుకునేలా.. తన జ్ఞాపకాలు తడిమి చూసుకునేలా కాస్త టైం ఇవ్వండి.

Anand Mahindra: మదర్స్ డేకు ఇల్లు గిఫ్ట్ ఇచ్చిన ఆనంద్ మహీంద్రా
అమ్మంటే మీకెంత ఇష్టమో అద్భుతమైన వాక్యాల్లో పెట్టండి. అందమైన కవిత రాయండి. కుటుంబ సభ్యులంతా కలిసి సర్ ప్రైజ్‌గా ప్లాన్ చేసి ఇంటికి కేక్ తీసుకురండి. కేక్ కట్ చేశాకా.. అమ్మ గురించి అద్భుతమైన కవిత రాసి ప్రేమను వ్యక్తం చేయండి. లేదా అమ్మ ప్రేమను చాటుతూ స్పీచ్ ఇవ్వండి. మనసులో ప్రేమను వ్యక్తం చేయడానికి ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి.

precious gift for mom : అమ్మకి ఏమి బహుమతి ఇవ్వాలి…

ఏదైనా బ్యాడ్ హ్యాబిట్ ఉంటే మార్చుకోమని అమ్మ చెబుతూ ఉంటుంది. కనీసం ఆరోజు నుంచి అమ్మ చెప్పిన మాట వినాలని కఠినమైన నిర్ణయం తీసుకోండి. అమ్మ ఏం చెప్పినా మన మంచికే కదా.. ఇక తాను చెప్పినట్లు వింటే అమ్మకి సంతోషమే కదా. ప్రతి అమ్మలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. అమ్మలో దాగి ఉన్న కళను ప్రోత్సహించండి. వయసు జస్ట్ నంబర్ మాత్రమే. తనకు ఇష్టమైన పుస్తకాలు కొని ఇవ్వండి. తనకి ఇష్టమైన ఏదైనా పని ప్రారంభించేలా ప్రోత్సాహం ఇవ్వండి.

Viral video: పదవీ విరమణ చేసే ముందు ఆర్మీ దుస్తుల్లో చివరిసారిగా తల్లికి సెల్యూట్

మన ఆరోగ్యం గురించి అమ్మ ఆరాటపడుతుంది. అమ్మ ఆరోగ్య పరిస్థితిని కూడా కనిపెట్టుకుని ఉండండి. కుటుంబాన్ని ఇబ్బంది పెట్టకూడదని చాలా విషయాలు గుప్తంగా ఉంచుతుంది అమ్మ. అలాంటి అమ్మ పట్ల మనకు బాధ్యత ఉండాలి. ఎంతసేపు మన పనుల్లో మనం కొట్టామిట్టాడమే కాదు.. మన కోసం అహర్నిశలు పాటుపడ్డ అమ్మకి ఏమిచ్చినా తిరిగి రుణం తీర్చుకోలేం. కానీ ఆమెని ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవడం మన బాధ్యత. చిన్న చిన్న ఆనందాలు చాలు అమ్మకి.. అవే పెద్ద సెలబ్రేషన్ ఆమెకి. అమ్మకి ఇష్టమైన పని చేయండి. అదే ఆమెకు అందమైన సెలబ్రేషన్.