Viral Video: తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన కుమారుడు

తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన తల్లి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు వేశాడు. ఆ బంగారు గొలుసును చూసుకున్న ఆ తల్లి మురిసిపోయింది.

Viral Video: తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చిన కుమారుడు

Viral Video

Viral Video: తల్లి మెడలో బంగారు గొలుసు వేసి సర్‌ప్రైజ్ ఇచ్చాడు ఓ కుమారుడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. తన తల్లి ఇంట్లో కూర్చొని పని చేసుకుంటున్న సమయంలో వెనుక నుంచి వచ్చి ఆమె మెడలో బంగారు గొలుసు వేశాడు. ఆ బంగారు గొలుసును చూసుకున్న ఆ తల్లి మురిసిపోయింది.

ఆ సమయంలో మరొకరు స్మార్ట్ ఫోన్ లో వీడియో తీశారు. 40 క్షణాల పాటు ఈ వీడియో ఉంది. గుల్జార్ సాహబ్ అనే వ్యక్తి ఈ వీడియోను ట్విటర్ లో పోస్ట్ చేస్తూ ‘తల్లికి చిన్న గిఫ్టు’ అని రాసుకొచ్చాడు. అమ్మకి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన ఆ యువకుడిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

కని, పెంచిన తల్లిని సంతోష పెట్టడం కంటే గొప్ప విషయం మరేదీ లేదని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. కన్న తల్లి రుణాన్ని ఏం ఇచ్చినా తీర్చుకోలేమని మరో వ్యక్తి కామెంట్ చేశాడు. తన తల్లికీ ఇలాంటి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నానని మరో నెటిజన్లు పేర్కొన్నాడు.


10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..