precious gift for mom : అమ్మకి ఏమి బహుమతి ఇవ్వాలి…

మే 14న మదర్స్ డే వస్తోంది. అమ్మకి బహుమతిగా ఏమిద్దాం? అసలు అమ్మకి ఏం ఇష్టం? ఎప్పుడైనా అడిగారా? మదర్స్ డే రోజు అమ్మ ఇష్టాన్ని నెరవేర్చండి. ఆమెతో సంతోషాన్ని పంచుకోండి.

precious gift for mom : అమ్మకి ఏమి బహుమతి ఇవ్వాలి…

precious gift for mom

అమ్మ.. మరో బ్రహ్మ. ఆమె లేని మనల్ని ఊహించుకోలేం. తన ప్రాణాల్ని పణంగా పెట్టి ఈ భూమిపై మనల్ని తీసుకువస్తుంది. తన ప్రాణాలు ఉన్నంతవరకూ మనకోసమే పరితపిస్తుంది. ఎన్ని కష్టాలు వచ్చిన భరిస్తుంది. ఆఖరికి ఆమెను పట్టించుకోకపోయినా క్షమిస్తుంది. అలాంటి అమ్మకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేం. ఏటా మే నెలలో వచ్చే రెండవ ఆదివారం “అంతర్జాతీయ మాతృ దినోత్సవం” జరుపుకుంటాం. ఆరోజు చాలామంది తమ తల్లి మీద ప్రేమను చాటుతూ బహుమతులు కొని ఇస్తుంటారు. అయితే అమ్మకు ఎలాంటి బహుమతులు ఇవ్వాలి…

మాస్కులు కుడుతోంది మా అమ్మ కాదు- ఆ అమ్మకి నా కృతజ్ఞతలు..

బిజీ లైఫ్ లో చాలామందికి తల్లిదండ్రులతో గడిపే సమయమే దొరకట్లేదు.. అందుబాటులో ఉండి కొందరు.. విదేశాల్లో ఉండి మరికొందరు తల్లిదండ్రుల బాధ్యతల్ని విస్మరిస్తున్నారు. కనీసం ఇలాంటి రోజైనా తల్లిదండ్రులతో ప్రత్యేకంగా మాట్లాడటానికో.. సమయం కేటాయించడానికో.. వీలు చేసుకుంటారు. ఒక రకంగా చెప్పాలంటే పాశ్చత్య సంప్రదాయమైన కొన్ని దినోత్సవాలు మన సంస్కతిలోకి చేరినా కొన్ని మరిచిపోతున్న బాధ్యతల్ని గుర్తు చేస్తున్నాయి.

Mother stork : గూడు నుంచి బిడ్డను పడేసిన తల్లి కొంగ.. ఎందుకీ కఠిన నిర్ణయం తీసుకుందంటే?

మదర్స్ డే రోజు అమ్మకి ఏమివ్వాలి? ఈ జీవితాన్ని ఇంత అందంగా మనకి అందించిన అమ్మకి ఏమిచ్చినా రుణం తీరదు. కానీ బిడ్డల కోసం అహర్నిశలు త్యాగం చేసిన తల్లికి కూడా ఎన్నో ఇష్టాలు ఉంటాయి. అవేంటో మీకు తెలిసే ఉంటాయి. అమ్మకి ఇష్టమైన చీరలు కొనుక్కోవాలని అనిపించినా అనవసరం ఖర్చు అని మనసులో ఆ కోరికను అణుచుకున్న రోజులు ఉండే ఉంటాయి. సరదాగా ఆమెను బయటకు తీసుకెళ్లి తనకిష్టమైన చీరలు కొనిపెట్టండి. ఆమె కళ్లల్లో కనిపించే ఆనందం మీకు తెలుస్తుంది.

 

పిల్లలంతా ఎక్కడెక్కడో ఉంటారు. కలవడానికి ఒకరికి కుదిరితే మరొకరికి కుదరదు..కానీ మీరంతా కలిసి ఉన్న సందర్భాల్లో ఫోటోలు దిగే ఉంటారు కదా.. మీరంతా కలిసి ఉన్న అందమైన మీ ఫ్యామిలీ ఫోటోని ఫ్రేమ్ కట్టించి అమ్మకి బహుమతిగా ఇవ్వండి. అమ్మ అది చూసి మీరంతా తనతో ఉన్నట్లే భావిస్తుంది. మదర్స్ డే రోజు ఇది కూడా అరుదైన కానుక.

 

ప్రతిరోజు అందరూ బిజీనే కనీసం మదర్స్ డే రోజు మొత్తం ఆమెతోనే స్పెండ్ చేయండి. ఎప్పుడు మనకి వండి పెట్టే అమ్మకి ఇష్టమైన ఫుడ్ స్వయంగా మీరే వండి తినిపించండి. మీ చేతి వంట రుచి చూడటమే గొప్ప బహుమతిగా ఫీలవుతారు అమ్మలంతా.

Bandla Ganesh : అమ్మకు అండగా.. బండ్ల గణేష్ మంచి మనసుకు అభినందనల వెల్లువ..

అమ్మకి నచ్చిన రేడియో కొనివ్వండి. లేదంటే ఆమెకు నచ్చిన పాటలన్నీ కలెక్ట్ చేసి ఇవ్వండి. మొక్కలు పెంచడం ఇష్టమైన వారికి అందమైన పూల మొక్కలను బహుమతిగా తీసుకెళ్లండి. ఇంట్లో ఎన్ని మొక్కలు ఉన్నా మీరిచ్చిన మొక్కని అమ్మ ప్రత్యేకంగా అభిమానంగా పెంచుకుంటుంది.

Temple to Mother : రూ.10 కోట్ల ఖర్చుతో..పంచగోపురాలతో అమ్మకు గుడి కట్టిస్తున్న కొడుకు

తల్లిదండ్రుల ఇష్టాలు గమనించుకున్న పిల్లలకు వారికి బహుమతులు ఇవ్వడం చాలా ఈజీ అవుతుంది. చాలామంది ఇలాంటి దినోత్సవాల పట్ల ఆసక్తి చూపించరు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఇలాంటి రోజు సెలబ్రేట్ చేసుకోవడం అవసరం అనిపిస్తుంది. నిజానికి ఏ బహుమతులు ఇచ్చినా అమ్మ రుణం మాత్రం ఎవరూ తీర్చుకోలేరు. ఆమెను కష్టపెట్టకుండా జీవితాంతం సంతోషంగా చూసుకోవడమే ఆమెకు బిడ్డలు ఇచ్చే నిజమైన బహుమతి.