Mother stork : గూడు నుంచి బిడ్డను పడేసిన తల్లి కొంగ.. ఎందుకీ కఠిన నిర్ణయం తీసుకుందంటే?

తల్లి మనసు ఎంతో గొప్పది. తన బిడ్డల ప్రాణాల కోసం తన ప్రాణాలు అయినా అర్పిస్తుంది. అలాంటిది ఓ తల్లి కొంగ తన గూడు నుంచి ఒక బిడ్డను కిందకు పడేసింది. కఠినంగా ప్రవర్తించిన ఆ కొంగ అలా చేయడానికి కారణం ఏమై ఉంటుంది?

Mother stork : గూడు నుంచి బిడ్డను పడేసిన తల్లి కొంగ.. ఎందుకీ కఠిన నిర్ణయం తీసుకుందంటే?

Mother stork

Mother stork :  ఓ తల్లి కొంగ (mother stork) తన గూడులో (nest) ఉన్న ముగ్గురు బిడ్డల్లోంచి ఒక బిడ్డను కిందకు విసిరేసింది (throws). అయ్యో.. ఎంత అన్యాయం? తల్లి కొంగ ఎంత దుర్మార్గురాలు.. అని వెంటనే తిట్టేస్తాం. కదా.. కానీ ఎందుకు అలా చేసి ఉంటుంది? విషయం తెలిస్తే ఆ తల్లి మనసు అర్ధం చేసుకుంటారు.

Viral Video : షాకింగ్.. పోలీస్‌ని 20 కిమీ లాక్కెళ్లిన కారు డ్రైవర్, వీడియో వైరల్

ఈ ప్రపంచంలో తల్లి ప్రేమను మించినది లేదు. తన పిల్లలు చెప్పిన మాట వినకపోయినా.. తప్పు చేసినా క్షమించే గుణం ఒక్క అమ్మకి మాత్రమే ఉంటుంది. మనుష్యులే కాదు జంతువులు కూడా తమ బిడ్డల్ని ఎంతో ప్రేమతో సాకుతాయి. వాటికి ఊహ తెలిసే వరకూ వెన్నంటే ఉంటాయి. ఇతర జంతువులు వాటికి హాని చేయకుండా కాపాడుకుంటాయి. విషయానికి వస్తే ఓ తల్లి కొంగ గురించి చెప్పాలి. తన గూడులో ముగ్గురు బిడ్డలతో ఉన్న ఆ కొంగ వాటిలో ఒకదాన్ని ముక్కుతో పట్టుకుని ఎత్తునుంచి కిందకు పడేసింది.తాజాగా ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ దృశ్యం చూసినవారికి మనసు చలించిపోతుంది. ఆ తల్లి కొంగ ఎంతటి కసాయిది అని కోపం వస్తుంది. కారణం తెలిస్తే మన అభిప్రాయాన్ని వెనక్కి తీసుకుంటాం.

Kallakurichi collector in controversy : అటెండర్‌ని షూస్ తీసుకెళ్లమంటూ కలెక్టర్ ఆర్డర్.. ఏకిపారేస్తున్నజనం వీడియో వైరల్

సరైన ఎదుగుదల లేని బిడ్డ కావడంతో.. దానివల్ల ఇతర బిడ్డలకు హాని జరుగుతుందనే కారణంతోనే ఆ తల్లికొంగ తన బిడ్డను కిందకు విసిరేసిందిట. అంటే మిగతా బిడ్డలను కాపాడుకోవడం కోసం ఆ తల్లి కొంగ మనసుని ఎంత దృఢ పరుచుకుని ఈ పనికి పూనుకుందో అర్ధం చేసుకోవచ్చును. తాజాగా 63 కొంగల గూళ్లలో పరిశోధకులు (researchers) చేసిన పరిశోధనల్లో 9 గూళ్లలో ఇలాంటి సంఘటనలు గమనించారట. దీనిని బట్టి ఆ తల్లి కొంగ ఎందుకు తన బిడ్డను పడేసిందో అర్ధం చేసుకోవచ్చు.