Movie Releases: ఈ వారం థియేటర్లలో రానున్న సినిమాలివే

ఒకపక్క ధియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ సినిమాల హవా చూపిస్తుండగానే.. ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి.

Movie Releases: ఈ వారం థియేటర్లలో రానున్న సినిమాలివే

Movie Releases

Movie Releases: ఒకపక్క ధియేటర్లలో ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ 2 లాంటి భారీ సినిమాల హవా చూపిస్తుండగానే.. ఇంకా పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. సందు దొరికినప్పుడల్లా చిన్న సినిమాలు కూడా ధియేటర్లోకొచ్చేస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు.. వరసగా ఓటీటీలతో పాటు ధియేటర్లు కూడా.. ఈ వీక్ ఇంకా ఎగ్జైటింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చెయ్యబోతున్నాయి. ఏప్రిల్‌ లాస్ట్ వీక్‌లో ఒక పెద్ద సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.

Telugu Movie Releases: బాక్సాపీస్ వద్ద కొత్త సినిమాల వాషౌట్.. ఆర్ఆర్ఆర్ ఎఫెక్టేనా?

మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్‌ చరణ్‌, డైరెక్టర్‌ కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ఆచార్య’. ఆర్ఆర్ఆర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మల్టీస్టారర్ సినిమా తర్వాత రామ్ చరణ్ తండ్రి చిరంజీవితో కలిసి నటించిన మల్టీస్టారర్ సినిమా కావడంతో మెగా అభిమానులు ఈ సినిమా కోసం వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుండి వచ్చిన పాటలు, టీజర్లు, ట్రైలర్ ఓ రేంజ్ లో అంచనాలు పెంచేయగా.. భారీ అంచనాల మధ్య ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ‘ఆచార్య’.

Movie Releases: స్టార్ హీరోల హవా.. చిన్న హీరోల టార్గెట్ ఈ రెండు నెలలే!

టాలీవుడ్ స్టార్‌ హీరోయిన్స్‌ సమంత, నయనతారలతో కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్ సేతుపతి ట్రైయాంగిల్ లవ్ స్టోరీ కణ్మనీ రాంబో ఖతీజా కూడా ఈ వారమే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. నయన్ ప్రియుడు విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వం వహించిన ‘కాతు వాక్కుల రెండు కాదల్‌’ను తెలుగులో ‘కణ్మనీ రాంబో ఖతీజా’గా రిలీజ్ చేస్తున్నారు. ‘ఆచార్య’ కంటే ఒక్క రోజు ముందుగా అంటే ఏప్రిల్‌ 28న ఈ కామెడీ ట్రైయాంగిల్ లవ్ స్టోరీ థియేటర్లలోకి రాబోతుంది.

Movie Releases: నీ ప్రతాపమా.. నా ప్రతాపమా.. ధియేటర్లు-ఓటీటీల ఎంటర్‌టైన్‌మెంట్ ఫైట్!

బాలీవుడ్‌ స్టార్‌ హీరోలు అమితాబ్‌ బచ్చన్‌, అజయ్ దేవగణ్‌ కలిసి నటించిన చిత్రం ‘రన్‌ వే 34’. ఆరేళ్ల తర్వాత మళ్లీ అజయ్ దేవగన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్‌ కూల్ బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్, ఆకాంక్ష సింగ్‌ హీరోయిన్స్. రకుల్‌, అజయ్ దేవగణ్‌ పైలట్లుగా నటించగా, అమితాబ్‌ ఇన్వెస్టిగేటివ్‌ ఆఫీసర్‌గా అలరించనున్నారు. 2015లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. బాలీవుడ్ యంగ్‌ హీరో టైగర్‌ ష్రాఫ్‌ నటించిన హీరోపంతీ 2 కూడా ఈ వారమే రిలీజ్ కానుంది. అహ్మద్ ఖాన్ డైరెక్ట్ చేసిన ఈ మూవీలో తారా సుతారియా హీరోయిన్‌ కాగా.. నవాజుద్దీన్‌ సిద్ధిఖీ విలన్. ఏప్రిల్‌ 29న రిలీజ్ కానుంది.