Movie Theatres : తెలంగాణా థియేటర్స్‌లో బొమ్మ పడలేదు..

గవర్నమెంట్ 100 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా తెలంగాణలో థియేటర్లు తెరుచుకోలేదు..

Movie Theatres : తెలంగాణా థియేటర్స్‌లో బొమ్మ పడలేదు..

Movie Theatres

Movie Theatres: ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు చేదు వార్త అందింది. జూలై 23 నుండి గవర్నమెంట్ 100 శాతం ఆక్యుపెన్సీతో పర్మిషన్ ఇచ్చినా తెలంగాణలో థియేటర్లు తెరుచుకోలేదు. సరైన సినిమాలు రిలీజ్‌కు లేకపోవడం వల్లే బొమ్మ పడలేదు అంటున్నారు థియేటర్ యాజమానులు. ఇటీవలే సింగిల్ స్క్రీన్స్‌లో పార్కింగ్ ఫీజు వసూలు కూడా పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం.

Telangana Theatres : థియేటర్లలో పార్కింగ్ ఫీజ్ వసూలుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్..

ఓ వైపు థియేటర్ ఓనర్స్ సినిమాల కోసం ఎదురు చూస్తుండగా.. కరోనా భయంతో ప్రేక్షకులు సినిమా హాలుకి వస్తారో లేదో అనే సందేహంలో ఉన్నారు నిర్మాతలు. ఈరోజు రిలీజ్ అని డేట్ ఎనౌన్స్ చేసిన ‘నరసింహపురం’ సినిమా కూడా ఈనెల 30 కి వాయిదా పడింది. ఈ నెల 30న ‘తిమ్మరుసు’, ‘ఇష్క్’, ‘నరసింహపురం’, ‘ఇప్పుడుకాక ఇంకెప్పుడు’ వంటి నాలుగు సినిమాలు రిలీజ్ కానున్నాయి. ఆగస్టు 5నుంచి మల్టీప్లెక్స్‌లు రీ ఓపెన్ కానున్నాయి.

హాలీవుడ్ మూవీ ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్-9’ సినిమాతో మల్టీప్లెక్స్‌లు మళ్లీ తెరుచుకోనున్నాయి. సింగిల్ స్క్రీన్ థియేటర్లు జూలై 30 నుంచి తెరచుకోనున్నాయి. అయితే ఇంకా పెద్ద సినిమాలు, స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్‌లు ప్రకటించలేదు నిర్మాతలు. ప్రేక్షకుల స్పందనను బట్టి పెద్ద సినిమాలు రిలీజ్ డేట్‌లు ప్రకటించే అవకాశం ఉంది.
ఆంధ్రాలో 50 పర్సెంట్ అనుమతితో మూడు షోలు ప్రదర్శించడానికి అనుమతి ఉన్నా థియేటర్స్ తెరుచుకోలేదు. ఆంధ్రాలో కూడా వంద ఆక్యుపెన్సీతో నాలుగు ఆటలకు పర్మిషన్ వచ్చినప్పుడు పెద్ద సినిమాలు రిలీజ్‌లు చేసే అవకాశం ఉందంటున్నారు. రెండు రాష్ట్రాలలో పరిస్థితి చక్క బడిన తరువాతే రిలీజ్ చేస్తామంటున్నారు ‘టక్ జగదీష్’, ‘లవ్ స్టొరీ’, ‘విరాట పర్వం’ సినిమాల నిర్మాతలు.