మోడ్రన్ డ్రెస్సుతో గుర్రంపై స్వారీ చేస్తూ..వరుడి ఇంటికి వచ్చిన వధువు

మోడ్రన్ డ్రెస్సుతో గుర్రంపై స్వారీ చేస్తూ..వరుడి ఇంటికి వచ్చిన వధువు

MP bride rode to grooms residence on horse : పెళ్లి ఊరేగింపుల్లో వరుడు గుర్రంపై ఊరేగుతూ వధువు ఇంటికి రావటం జరుగుతుంటుంది. కానీ మధ్యప్రదేశ్ లో సీన్ రివర్స్ అయ్యింది. వధువే గుర్రంపై దర్జాగా స్వారీ చేస్తూ వరుడి ఇంటికి వచ్చింది. ఆడపిల్లలు దేంట్లోనూ తక్కువ కాదని నిరూపించేందుకు సత్నా జిల్లాలో ఓ వధువు ఇలా గుర్రం మీద ఊరేగితూ వరుడు ఇంటికి వచ్చింది. పైగా పెళ్లికూతురు అలంకరనతో కాకుండా.. మోడ్రన్ డ్రెస్ తో గుర్రంపై ఊరేగుతూ వచ్చింది.

సత్నా జిల్లాకు చెందిన దీపా వలేచా అనే వధువు గుర్రంపై స్వారీ చేస్తూ వరుడి ఇంటికి వచ్చింది. వాలెచా వారి ఇంటిలో ఏకైక కుమార్తె. దీపా అంటే ఇంటిలో ఓ గారాల పట్టి. అపురూపంగా పెంచారు. అలాని దీపా ఆకతాయి పిల్ల కాదు. బాధ్యత తెలిసిన పిల్ల. ఆడపిల్లలు దేంట్లోనే మగపిల్లలకు తక్కువకాదనే పిల్ల. ఆత్మవిశ్వాసం కలిగిన తమ కూతుర్నిచూసి దీపా తల్లిదండ్రులు మురిసిపోతుంటారు. అలా ఎంతో గారాబంగా పెంచుకున్న తన కూతురు దీపా పెళ్లి సందర్భంగా వరుడి ఇంటికి గుర్రంపై స్వారీ చేస్తూ వెళ్లాలనే కోరికను తల్లిదండ్రులు తీర్చారు. పెళ్లికూతురు అలంకరనతో కాకుండా.. మోడ్రన్ డ్రెస్ తో రావటం మరో విశేషం.

ఆడపిల్లలు ఎవరికీ భారం కాదని..ఈరోజుల్లోనే కాదు ఎప్పటికీ ఆడవారు మగవారికి తక్కువకాదని నిరూపించేందుకు ఇలా గుర్రంపై స్వారీ చేస్తూ వరుడి ఇంటికి వచ్చానంటోంది దీపా వలేచా. కుమార్తెలకు సమాజంలో కొడుకులాగే సమాన హక్కులున్నాయని చెబుతూ వధువు గుర్రపు స్వారీ చేస్తూ పెట్టిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.గుర్రపు స్వారీ చేసిన వధువు దీపాను నెటిజన్లు అభినందిస్తున్నారు. శెభాష్ అంటూ ప్రశంసిస్తున్నారు.

కాగా.. గతంలో కూడా పలువురు వధువులు గుర్రంపై ఊరేగిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్‌లోని ఖాండ్వా జిల్లాలోని సత్వారా గ్రామంలో ఓ వధువు ఇలాగే గుర్రపు స్వారీచేస్తూ వరుడు ఇంటికి వచ్చిన సందర్భాల ఫోటోలివి..