MP Police: వ్యాక్సినేషన్ చేయించుకోని వాళ్లకు పుర్రె పోస్టర్లు

వ్యాక్సిన్ పై అవగాహన పెంచి.. కరోనా మహమ్మారి నుంచి తట్టుకుని నిలబడాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్తున్నా.. పట్టించుకోవడం లేదు. వ్యాక్సిన్ కొరత కనిపిస్తున్నా విశ్వ ప్రయత్నాలు చేసి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు, అధికారులు నానా తంటాలు పడుతున్నారు.

MP Police: వ్యాక్సినేషన్ చేయించుకోని వాళ్లకు పుర్రె పోస్టర్లు

Private Hospitals Vaccine

MP Police: వ్యాక్సిన్ పై అవగాహన పెంచి.. కరోనా మహమ్మారి నుంచి తట్టుకుని నిలబడాలంటే వ్యాక్సినేషన్ తప్పనిసరి అని చెప్తున్నా.. పట్టించుకోవడం లేదు. వ్యాక్సిన్ కొరత కనిపిస్తున్నా విశ్వ ప్రయత్నాలు చేసి ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు, అధికారులు నానా తంటాలు పడుతున్నారు. మధ్యప్రదేశ్ లోనూ అదే పరిస్థితి. కాకపోతే రాష్ట్రానికి చెందిన నివారీ జిల్లాలో ఇంకొంత మంది వ్యాక్సిన్ వేసుకోవడానికి నిరాకరిస్తున్నారు.

వీళ్లకు బుద్ధి చెప్పేలాగా పోలీసులు కొత్తగా ఆలోచించారు. కొవిడ్ షాట్ వేసుకున్న వారికిజాతీయ జెండా గుర్తుతో ఉన్న బ్యాడ్జ్ ఇచ్చి గౌరవించడంతో పాటు వ్యాక్సిన్ వేసుకోని వారికి పుర్రె గుర్తులు ఇచ్చి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. లాక్ డౌన్ టైంలో రోడ్లపై అడపాదడపా చెకింగ్ లు చేస్తున్నా పోలీసులు.. ఇలా చేస్తున్నారు.

‘నేను దేశభక్తుడిని, వ్యాక్సిన్ వేయించుకున్నా’ అని రాసి మూడు రంగుల బ్యాడ్జ్ ను ఇచ్చి గౌరవిస్తున్నారు. సింగిల్ డోస్ కూడా వేసుకోని వారికి పుర్రె గుర్తులు ఉన్న పోస్టర్లు అంటించి.. వార్నింగ్ ఇస్తున్నారు. ఆ పోస్టర్ మీద ‘నాకు దూరంగా ఉండండి. కొవిడ్ కు నేను వ్యాక్సిన్ వేయించుకోలేదు’ అని ఆపోస్టర్ పై రాసి ఉంది.

దేశంలో థర్డ్ వేవ్ ప్రమాదం పొంచి ఉందని చెప్తున్న క్రమంలో వ్యాక్సిన్ వేయించుకోవడం తప్పనిసరి అని పబ్లిక్ కు చెప్తున్నాం. అవగాహన డ్రైవ్ లో భాగంగా.. ఇలా బ్యాడ్జ్ లు లాంటివి ఇచ్చి గౌరవించడం, పుర్రె పోస్టర్లతో గుర్తు చేయడం వంటివి చేస్తున్నాం అని సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీఓ) సంతోష్ పటేల్ అన్నారు.