Nabha Natesh : తాగే ఆలోచనతోనే నిద్ర లేస్తాను అంటున్న నభా నటేష్.. ఇన్స్టా పోస్ట్ వైరల్..
ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు ఏదొక ఆలోచనతోనే మేల్కొంటారు. ఆ ఆలోచన జీవిత లక్ష్యం అయ్యుండొచ్చు లేదా రోజు వచ్చే సాధారణ ఆలోచనలు అయ్యుండొచ్చు. అయితే నభా మాత్రం తాగాలనే ఆలోచనతోనే..

Nabha Natesh shared without makeup photos gone viral in instagram
Nabha Natesh : ఇస్మార్ట్ పోరి నభా నటేష్.. కన్నడ సినిమాలతో వెండితెరకు పరిచయం అయ్యింది. అక్కడ పలు సినిమా చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ తెలుగులో ఎంట్రీతోనే మంచి గుర్తింపుని సంపాదించుకుంది. సుధీర్ బాబు హీరోగా తెరకెక్కిన ‘నన్ను దోచుకుందువటే’ సినిమాలో హీరోయిన్ గా నటించి తన చలాకి యాక్టింగ్ తో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఆ తరువాత పూరీజగన్నాధ్, రామ్ కాంబినేషన్ లో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాలో నటించి యూత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకుంది.
Jawan : షారుఖ్ జవాన్ సినిమా విషయంలో నమోదైన పోలీస్ కేసు.. ఎందుకో తెలుసా..?
ఆ మూవీ హిట్టుతో పలు సినిమాల్లో ఛాన్సులు వచ్చినా.. కరోనా వల్ల, ఆ తరువాత యాక్సిడెంట్ కి గురయ్యి సర్జరీతో కొన్నాళ్ళు సినిమాలకు దూరం అవ్వడంతో ఆడియన్స్ తో పాటు మేకర్స్ కూడా నభాని మర్చిపోయారు. ఇక ఇటీవలే ఆమె పూర్తిగా కోలుకొని మళ్ళీ తిరిగి వచ్చింది. సినిమాల్లో ఛాన్సులు కోసం అనేక ఫోటోషూట్స్ చేస్తూ తెగ ప్రయత్నిస్తుంది. కానీ ఈ అమ్మడిని ఏ ఆఫర్ వరించడం లేదు. కాగా తాజాగా ఈ భామ.. మార్నింగ్ లేవగానే మేకప్ లేకుండా కొన్ని ఫోటోలు దిగి వాటిని తన ఇన్స్టాలో షేర్ చేసింది.
Chiranjeevi : భోళా శంకర్ అయిపోయింది.. చిరు నెక్స్ట్ ఏంటి? బర్త్ డేకి ఆ దర్శకుడితో సినిమా అనౌన్స్?
ఈ ఫోటోలకు ఒక క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. అదేంటంటే.. “ప్రతిరోజు ఉదయం ప్రతి ఒక్కరు ఏదొక ఆలోచనతోనే మేల్కొంటారు. ఆ ఆలోచన జీవిత లక్ష్యం అయ్యుండొచ్చు లేదా రోజు వచ్చే సాధారణ ఆలోచనలు అయ్యుండొచ్చు. అలాగే కొందరిలో ఈ ఆలోచనలు స్థిరంగా ఉండొచ్చు లేదా వాతావరణంలా మారిపోతూ కూడా ఉండొచ్చు. అయితే నన్ను ప్రతిరోజు నిద్ర లేపింది మాత్రం ఒకటే ఆలోచన. అదే కాఫీ తాగడం. కాఫీ తాగాలనే ఆలోచనతోనే ప్రతిరోజు నిద్ర లేస్తాను” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఈ పోస్టులో నభా మేకప్ లేని ఫొటోస్ షేర్ చేయడంతో.. ఒకొక్కరు ఒకోలా కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram