NC 22 : నాగ చైతన్య ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..

అయితే నాగచైతన్య ప్రజెంట్ చేస్తున్న మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ అవ్వడంతో ఫాన్స్ వర్రీ అవుతున్నారు. ఎందుకంటే నాగచైతన్య కి పెద్దగా యాక్షన్ కలిసిరాలేదు. కెరీర్ లో యాక్షన్ మూవీస్...........

NC 22 : నాగ చైతన్య ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమా.. కంగారు పడుతున్న ఫ్యాన్స్..

Naga Chaitanya NC22 is a full length action movie

NC 22 :  నాగచైతన్య ఈమధ్య రొటీన్ సినిమాల కన్నా ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికే ఎక్కువ ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. లవ్ స్టోరీల్ని కంప్లీట్ గా పక్కన పెట్టేశాడు. రొటీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ జోలికి వెళ్లడం లేదు. సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉన్న సబ్జెక్ట్స్ మీదే ఫోకస్ చేస్తున్నాడు చైతన్య. ఇటీవల వచ్చిన థాంక్యూ, లాల్ సింగ్ చద్దా లాంటి సినిమాలు పెద్దగా ఆడకపోవడంతో ఫుల్ లెంగ్త్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు చైతన్య.

చైతన్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. తమిళ్ డైరెక్టర్ వెంకట్ ప్రభు తో భారీ స్టార్ కాస్ట్ తో కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో నాగ చైతన్య పోలీస్ గా కనపడనున్నాడు. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సీన్ లీక్ అయి వైరల్ గా మారింది. ఈ సినిమాకి సంబందించి సాలిడ్ అప్డేట్ ఇచ్చింది టీమ్. ఎనిగ్ మాటిక్ ఎక్విప్ మెంట్ తో లావిష్ గా యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది. ఈ సినిమాలో అరవిందస్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్ లాంటి స్టార్ కాస్ట్ ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చెయ్యబోతున్నారు. ఇలా తన అప్ కమింగ్ మూవీని కంప్లీట్ యాక్షన్ తో నింపెయ్యబోతున్నారు చైతన్య.

Pooja Ramachandran : తల్లి కాబోతున్న మరో హీరోయిన్.. భర్తకి లిప్ లాక్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసిన పూజా రామచంద్రన్..

అయితే నాగచైతన్య ప్రజెంట్ చేస్తున్న మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ అవ్వడంతో ఫాన్స్ వర్రీ అవుతున్నారు. ఎందుకంటే నాగచైతన్య కి పెద్దగా యాక్షన్ కలిసిరాలేదు. కెరీర్ లో యాక్షన్ మూవీస్ ఏవీ సక్సెస్ తెచ్చిపెట్టలేదు. జోష్ దగ్గరనుంచి తడాఖా, దడ, ఆటోనగర్ సూర్య, తడాఖా, దోచెయ్, యుద్దం శరణం, సవ్యసాచి.. ఇలా యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్నవేవీ హిట్ కాలేదు. దీంతో ఇప్పుడు వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమా కంప్లీట్ యాక్షన్ కావడంతో ఎక్కడ తేడా కొడుతుందో అని టెన్షన్ పడుతున్నారు అక్కినేన అభిమానులు. మరి ఈ సినిమాతో అయినా హిట్ కొట్టి యాక్షన్ కలిసి రాదు అనే సెంటిమెంట్ ని చైతూ చెరిపేసుకుంటాడేమో చూడాలి.