MAA Elections : లాజిక్‌తో సవాల్ విసిరిన నాగబాబు..! విష్ణు దగ్గర బదులుందా..?

"25 సినిమాలు విష్ణు తీస్తే... ప్రకాశ్ రాజ్ కు 25 ఏళ్ల సినిమా ఎక్స్ పీరియన్స్ ఉంది. మిగతా భాషలతో సంబంధం లేకుండా.. ఏడాదిలో 25 తెలుగు సినిమాలు చేసిన ఘనత

MAA Elections : లాజిక్‌తో సవాల్ విసిరిన నాగబాబు..! విష్ణు దగ్గర బదులుందా..?

మోహన్ బాబుపైనా ఆరోపణలు

డైరెక్టర్ వైవీఎస్ చౌదరిని మోహన్ బాబు అధోగతి పట్టించాడు

నాగబాబు సంచలన కామెంట్స్

MAA Elections : జరుగుతున్నవి మా ఎన్నికలైనా… అసెంబ్లీ ఎన్నికల స్థాయిలో… ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకుంటున్నారు రెండు ప్యానెళ్ల పోటీదారులు…. వారి మద్దతుదారులు. ముఖ్యంగా.. ఎవరు లోకల్… ఎవరు నాన్ లోకల్ అనే చర్చ వాడీవేడిగా జరుగుతోంది. ఎవరికి తోచినట్టుగా వాళ్లు వివరణలు ఇచ్చుకుంటూ ఆధిపత్యం చాటేందుకు ప్రయత్నిస్తున్నారు సినీ ప్రముఖులు.

ప్రకాశ్ రాజ్ నాన్ లోకల్ అంటూ మాటల దాడి చేస్తున్న వారికి గట్టిగా కౌంటర్ ఇచ్చారు మెగా బ్రదర్ నాగబాబు. “దేశ ప్రధానితో పోరాటం తెలిసిన వ్యక్తి ప్రకాశ్ రాజ్. ప్రకాశ్ రాజ్ కు ఉన్న ప్రత్యేకతలు విష్ణులో లేవు. ప్రకాశ్ రాజ్ తో పోల్చాలంటే మోహన్ బాబును పోల్చాలి. విద్యార్థులకు ఏం కావాలో విద్యాసంస్థ నడుపుతున్న మోహన్ బాబుకు తెలుసు. నటీనటులకు ఏం కావాలో ఆఫీసుల చుట్టూ తిరిగిన ప్రకాశ్ రాజ్ కే తెలుసు” అన్నారు నాగబాబు.

నిర్మాతలతో వివాదం ప్రకాశ్ రాజ్ కే కాదు మోహన్ బాబు కుటుంబానికి కూడా ఉందని నాగబాబు సీరియస్ కామెంట్స్ చేశారు. సలీం చిత్రం విషయంలో డైరెక్టర్ వైవీఎస్ చౌదరినే మోహన్ బాబు అధోగతి పట్టించారని సంచలన విమర్శ చేశారు. మోహన్ బాబుకు ఎదురు తిరగలేక ఎంతో మంది వెనుతిరిగారని అన్నారు. మీ వివాదాల్లో తప్పెవరితో మాకు తెలియదనీ… ప్రకాశ్ రాజ్ వివాదాల్లో తప్పెవరితో మీకు తెలియదా”అని నాగబాబు ప్రశ్నించారు.

MAA Election: విష్ణు నా క్రమశిక్షణకి వారసుడు.. ఓటేయాలని మోహన్ బాబు లేఖ!

లాజిక్ తీసిన నాగబాబు
“25 సినిమాలు విష్ణు తీస్తే… ప్రకాశ్ రాజ్ కు 25 ఏళ్ల సినిమా ఎక్స్ పీరియన్స్ ఉంది. మిగతా భాషలతో సంబంధం లేకుండా.. ఏడాదిలో 25 తెలుగు సినిమాలు చేసిన ఘనత ప్రకాశ్ రాజ్ సొంతం. తెలుగు ఇండస్ట్రీ నటుల అసోసియేషన్ లో పరభాషా నటులు ఉంటున్నారు. వారికి డబ్బులు తీసుకుని మరీ ఓటు హక్కు కల్పించారు. ప్రకాశ్ రాజ్ కు మాలో సభ్యుడిగా ఓటు హక్కు ఉంది. ప్రకాశ్ రాజ్ ఓటుతో వేరేవాళ్లు అధ్యక్షుడు కావచ్చు కానీ… ఆయన అధ్యక్షుడిగా పోటీచేయడానికి మాత్రం అర్హుడు కాదా?” అంటూ లాజిక్ తో విష్ణుకు సవాల్ విసిరారు నాగబాబు.

తెలుగులో విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు
“విష్ణు నువ్ ఎక్కడ పుట్టావ్, ఎక్కడ చదువుకున్నావ్. విష్ణు మీ అమ్మానాన్నలు మాత్రమే తెలుగువాళ్లు. ప్రకాశ్ రాజ్, విష్ణు తెలుగు పరీక్ష రాస్తే విష్ణుకు పాస్ మార్కులు కూడా రావు. ప్రకాశ్ రాజ్ ని తెలుగోడంటారు, విష్ణును తెలుగు నేర్చుకొమ్మంటారు. సినిమా జ్ఞానం, ప్రపంచజ్ఞానం ఉన్న ప్రకాశ్ రాజ్ కే నా మద్దతు” అన్నారు నాగబాబు.

MAA Election: ‘మా’ ఎన్నికలలో ఎమ్మెల్యే రోజా ఓటెవరికి?