Naga Chaitanya : ‘మానాడు’ నేను చేయాలి.. కానీ రానా చేస్తున్నాడు.. నా నెక్స్ట్ సినిమాలు ఇవే..

చైతన్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడాడు. చైతూ మాట్లాడుతూ.. ''వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేస్తున్నాను. మాస్‌ సినిమా అది. అందులో..........

Naga Chaitanya : ‘మానాడు’ నేను చేయాలి.. కానీ రానా చేస్తున్నాడు.. నా నెక్స్ట్ సినిమాలు ఇవే..

Nagachaitanya

Naga Chaitanya :  నాగచైతన్య ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. లవ్ స్టోరీ, బంగార్రాజు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టి దూసుకుపోతున్నాడు. త్వరలో థాంక్యూ సినిమాతో హిట్ కొట్టబోతున్నాడు. నాగచైతన్య నటించిన థాంక్యూ సినిమా జులై 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే ట్రైలర్, సాంగ్స్ తో ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ బాబు సినిమాల రిఫరెన్స్ వాడటంతో అక్కినేనితో పాటు మహేష్ అభిమానులు కూడా సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చైతు థాంక్యూ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నాడు.

ఈ ప్రమోషన్స్ లో భాగంగా చైతన్య ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో తన నెక్స్ట్ సినిమాల గురించి మాట్లాడాడు. చైతూ మాట్లాడుతూ.. ”వెంకట్ ప్రభుతో ఒక సినిమా చేస్తున్నాను. మాస్‌ సినిమా అది. అందులో పోలీస్‌ ఆఫీసర్ గా కనిపిస్తాను. వెంకట్ ప్రభు తీసిన ‘మానాడు’ నాకు బాగా నచ్చింది. ఆ సినిమాని నేను తెలుగులో రీమేక్ చేద్దామనుకున్నా. కానీ రైట్స్ విషయంలో ఏవో సమస్యలు రావడంతో దాన్ని చేయలేకపోయాను. ప్రస్తుతం మానాడు రానా చేస్తున్నాడు.”

VV Vinayak : కొడాలినాని వల్ల ఎన్టీఆర్‌తో ఆ సినిమా చేయలేకపోయా

”పరశురామ్‌ ఒక కథ చెప్పాడు. స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. స్క్రిప్ట్ పూర్తయ్యాక ఆ సినిమా గురించి ప్రకటిస్తాం. విక్రమ్ కుమార్ దర్శకత్వంలోనే దూత సిరీస్ చేస్తున్నా. అది హారర్ స్టోరీ. తరుణ్‌ భాస్కర్‌ కూడా ఓ కథ చెప్పాడు. ఆ కథ చర్చల్లో ఉంది, ఇంకా ఫైనల్ అవ్వలేదు. అమీర్ ఖాన్‌తో కలిసి ‘లాల్‌సింగ్‌ చద్దా’ కోసం చేసిన ప్రయాణం గుర్తుండిపోతుంది. ఈ సినిమా తెలుగులో చిరంజీవి సమర్పణలో విడుదలవుతుండడం చాలా ఆనందంగా ఉంది. కొత్తగా హిందీ సినిమాలేవీ ఒప్పుకోలేదు. ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకులు నన్ను స్వీకరిస్తే అప్పుడు బాలీవుడ్ సినిమాల గురించి ఆలోచిస్తాను” అని తెలిపారు.