Nagarjuna : ప్రేక్షకులు ఏ సినిమాని హిట్ చేస్తారో ఇప్పటికి అర్ధం కాదు.. ఏది హిట్ అవుద్దో, ఏది ఫ్లాప్ అవుద్దో చెప్పలేం..

గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. ''ది ఘోస్ట్ లో హైలెట్ యాక్షన్ సన్నివేశాలే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. ఇపుడు రిలీజ్ చేసిన కిల్లింగ్ మెషిన్.........

Nagarjuna : ప్రేక్షకులు ఏ సినిమాని హిట్ చేస్తారో ఇప్పటికి అర్ధం కాదు.. ఏది హిట్ అవుద్దో, ఏది ఫ్లాప్ అవుద్దో చెప్పలేం..

Nagarjuna

Nagarjuna :  సీనియర్ హీరో కింగ్ నాగార్జున ఇటీవల సంక్రాంతికి బంగార్రాజు సినిమాలో తన కొడుకుతో కలిసి అలరించి హిట్ కొట్టారు. మొన్న సంక్రాంతికి వచ్చిన కింగ్ ఇప్పుడు దసరాకి రెడీ అయిపోయారు. నాగార్జున ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఘోస్ట్ అనే యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నారు. తాజగా ఈ సినిమా నుంచి చిన్న గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఈ గ్లింప్స్ లో నాగార్జున తన ప్రత్యర్థుల్ని రెండు చేతుల్లో రెండు కత్తులు పట్టుకొని స్టైలిష్ గా నరకడం చూపించారు.

గ్లింప్స్ రిలీజ్ సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించగా ఇందులో నాగార్జున మాట్లాడుతూ.. ”ది ఘోస్ట్ లో హైలెట్ యాక్షన్ సన్నివేశాలే, దర్శకుడు ప్రవీణ్ సత్తారు యాక్షన్ ని అద్భుతంగా తీశారు. ఇపుడు రిలీజ్ చేసిన కిల్లింగ్ మెషిన్ జస్ట్ గ్లింప్స్ మాత్రమే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ లు టెర్రిఫిక్ గా వుంటాయి. చాలా రోజుల తర్వాత నేను ట్రైనింగ్ తీసుకొని ఇలాంటి యాక్షన్ సీన్స్ చేశాను. ఇలాంటి యాక్షన్ గతంలో నేను చేయలేదు, నాకు చాలా కొత్తగా అనిపించింది. ఈ సినిమాలో ఘోస్ట్ అంటే దెయ్యం కాదు. ఒక ఏజెంట్ కి కోడె నేమ్ ఉండాలని ఘోస్ట్ అని పెట్టాం. క్యారెక్టర్ పేరు విక్రమ్. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 5న రిలీజ్ కాబోతుంది” అని తెలిపారు.

Babu Mohan : పాన్‌లో విషం కలిపి చంపడానికి ప్రయత్నించారు.. రాజకీయాలు అంత ప్రమాదం..

ఆ తర్వాత మీడియాతో చిట్ చాట్ నిర్వహించగా ఇన్నేళ్ళ మీ అనుభవంలో ఎలాంటి పాత్రలు, ఎలాంటి కథలని ప్రేక్షకులు యాక్సప్ట్ చేస్తున్నారనిపించింది అని ఓ విలేఖరి అడగగా నాగార్జున దీనికి బదులిస్తూ.. ”నిజంగా తెలీదండి. నాకే కాదు ఇది ఎవరికీ తెలియదని అనుకుంటాను. ప్రేక్షకులకు ఎప్పుడు, ఎందుకు ఏ సినిమా నచ్చుతుందో తెలీదు. శివ అందరూ ఫ్లాప్ అవుతుంది అన్నారు కానీ పెద్ద హిట్ అయింది. అన్నమయ్య కూడా అలాగే అన్నారు కానీ భారీ విజయం సాధించింది. ఆర్జీవితో తీసిన ఆఫీసర్ హిట్ అవుద్ది అనుకున్నాము కానీ ఫ్లాప్ అయింది. ఇలా ప్రేక్షకులు ఏ సినిమాని హిట్ చేస్తారో, ఫ్లాప్ చేస్తారో ఎవ్వరికి తెలీదు. ఇటీవల దీని గురించి రాజమౌళి గారితో మాట్లాడాను. ఆయన.. మన మనసుకు నచ్చిన సినిమా బలంగా నమ్మి తీసేయాలి. మనకి నమ్మకం ఉంటే జనాలకి కూడా నచ్చుతుంది అని అన్నారని తెలిపారు.