Nalgonda : పగబట్టిన కష్టాలు : రోడ్డుప్రమాదంలో కొడుకు, తట్టుకోలేక తండ్రి మృతి.. భరించలేని తల్లి ఆస్పత్రిపాలు

నల్గొండ జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. రోడ్డు ప్రమాదంలో కొడుకు మరణించగా, ఆ వార్త విని తండ్రి గుండెపోటుతో ప్రాణాలు విడిచాడు

Nalgonda : పగబట్టిన కష్టాలు : రోడ్డుప్రమాదంలో కొడుకు, తట్టుకోలేక తండ్రి మృతి.. భరించలేని తల్లి ఆస్పత్రిపాలు

Nalgonda

Updated On : October 11, 2021 / 4:14 PM IST

Nalgonda : ఒక్కసారే ఆ కుటుంబానికి కష్టాలు చుట్టుముట్టాయి. చేతికందొచ్చిన కొడుకు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు.. అది విని తండ్రికి గుండెపోటు వచ్చింది.. వీరి మృతి వార్త విని తట్టుకోలేక తల్లి ఆసుపత్రి పాలైంది. కాగా ఈ ఘటన మిర్యాలగూడ మండలంలో ఆదివారం చోటుచేసుకుంది. తడకమల్ల గ్రామం చౌదరి కాలానికి చెందిన గొర్ల ఇంద్రారెడ్డికి భార్య కుమారుడు ఉన్నారు. ఇంద్రారెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

Read More : Barabanki accident: ఆవును తప్పించబోయి ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 12 మంది మృతి

ఈయన కుమారుడు భరత్ రెడ్డి(30) ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో పొలం పనులు ముగించుకొని ఇంటికి వస్తుండగా గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో భరత్ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. కొడుకు మృతి విషయం తెలియగానే ఇంద్రారెడ్డి కుప్పకూలిపోయారు. దీంతో అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యంలోనే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. భర్త, కొడుకు మరణవార్త విన్న ఇంద్రారెడ్డి భార్య సుజాత ఆసుపత్రి పాలైంది. ఒకే రోజు తండ్రి కొడుకులు మృతి చెందటంతో తడకమల్ల గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Read More : Madhapur Road Accident : నిశ్చితార్ధం జరిగింది…త్వరలో పెళ్లి…. ఇంతలోనే….!