High Court: రాపిడోకు హైకోర్టు షాక్.. అల్లూ అర్జున్ ప్రకటనలో కత్తిరింపులు

తెలంగాణ హైకోర్టులో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ రాపిడోకు దిమ్మతిరిగే షాక్‌ ఎదురైంది.

High Court: రాపిడోకు హైకోర్టు షాక్.. అల్లూ అర్జున్ ప్రకటనలో కత్తిరింపులు

Rapido

Telangana High Court: తెలంగాణ హైకోర్టులో ప్రముఖ బైక్ ట్యాక్సీ సంస్థ రాపిడోకు దిమ్మతిరిగే షాక్‌ ఎదురైంది. ఆర్టీసీ పరువు నష్టం కలిగించే ప్రకటన ఫోటోలను ప్రసారం చేయడం నిలిపివేయాలంటూ రాపిడోను ఆదేశించింది హైకోర్టు.

యూట్యూబ్‌‌లో కూడా ఉన్న వీడియోలను, పరువు నష్టం కలిగించే ప్రకటన చిత్రాలను తీసివేయాలని ఆదేశించింది కోర్టు. కోర్టు ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లు తేలితే వారు ప్రాసిక్యూట్ చేయబడతారని కోర్టు స్పష్టం చేసింది.

అల్లు అర్జున్‌, రాపిడో సంస్థ తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యం నోటీసులు జారీ చేసింది. ఆర్టీసీ ప్రతిష్టను కించపరిచినందుకు హీరో అల్లు అర్జున్‌, రాపిడో సంస్థకు అధికారులు లీగల్‌ నోటీసులు జారీ చేశారు. ఆ రాపిడో ప్రకటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ అభ్యంతరం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీచేశారు.

Shilpa Chowdary: శిల్పాచౌదరి కేసులో మరో కొత్త పేరు!

అప్పట్లోనే టీవీ ప్రకటన నుంచి టీఎస్ఆర్‌టీసీ బస్సులను చూపించిన క్లిప్‌ను తొలగించింది. ఈ యాడ్‌లో అల్లు అర్జున్ నటించగా.. ఆర్టీసీ ప్రతిష్టకు భంగం కలిగించేలా యాడ్ ఉందని ఆర్టీసీ యండీ సజ్జనార్ ర్యాపిడో సంస్థతో పాటు అల్లు అర్జున్‌కూ నోటీసులు పంపించారు.