Balakrishna : యోగా చేస్తే మనసు ఆధీనంలో ఉంటుంది – బాలకృష్ణ..

మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి కావల్సిన సంకల్పాన్ని యోగా ఇస్తుందని, యోగం అంటే మనసుని గెలుచుకోవడం అంటూ పలు రకాల యోగాసనాల గురించి చెప్పి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు బాలకృష్ణ..

Balakrishna : యోగా చేస్తే మనసు ఆధీనంలో ఉంటుంది – బాలకృష్ణ..

Balakrishna

Balakrishna: యోగా చేస్తే మనసు ఆధీనంలో ఉంటుంది అన్నారు నటసింహ నందమూరి బాలకృష్ణ. జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో నిర్వహించిన యోగా సెలబ్రేషన్స్‌లో బాలయ్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

యోగా సెలబ్రేషన్స్‌లో పార్టిసిపేట్ చేసిన వారికి, బసవతారకం హాస్పిటల్, డాక్టర్స్, యోగా గురువులు, సిబ్బందికి అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియ చేశారాయన. మనసుకి స్వస్థత, నిర్మలత్వం కలిగించేదే యోగా అని చెప్పారు.

మనసులో ఒక పని అనుకున్నప్పుడు అది సాధించడానికి కావల్సిన సంకల్పాన్ని యోగా ఇస్తుందని, యోగం అంటే మనసుని గెలుచుకోవడం అంటూ పలు రకాల యోగాసనాల గురించి చెప్పి, యోగా యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేశారు బాలకృష్ణ.