Bimbisara : బార్బేరియన్ కింగ్ ‘బింబిసార’ గా నందమూరి కళ్యాణ్ రామ్..!

మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘‘బింబిసార’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు..

Bimbisara : బార్బేరియన్ కింగ్ ‘బింబిసార’ గా నందమూరి కళ్యాణ్ రామ్..!

Bimbisara

Bimbisara: నందమూరి కళ్యాణ్ రామ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ స్టెప్ తీసుకున్నారు. హోమ్ బ్యానర్ ఎన్టీఆర్ ఆర్ట్స్‌లో బావ కె.హరికృష్ణ నిర్మాతగా ఓ ప్రెస్టీజియస్ మూవీ చేస్తున్నారు. ‘బన్నీ’, ‘భగీరథ’ సినిమాలు ప్రొడ్యూస్ చేసిన నిర్మాత మల్లిడి సత్యనారాయణ కొడుకు వశిష్ట్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు..

నేడు (మే 28) స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ అండ్ ఫస్ట్‌లుక్‌తో గ్లింప్స్ కూడా రిలీజ్ చేశారు. మైథాలజీ బ్యాక్ డ్రాప్‌లో, భారీ బడ్జెట్, హై టెక్నికల్ వాల్యూస్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘‘బింబిసార’’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది ట్యాగ్ లైన్. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తోన్న 18వ చిత్రమిది..

Bimbisara

కెరర్ స్టార్టింగ్ నుంచి ఎన్నో వైవిధ్యమైన చిత్రాల్లో నటించిన క‌ళ్యాణ్ రామ్ మ‌రోసారి త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకున్నారు. ఇందులో క‌ళ్యాణ్ రామ్ లుక్‌, బ్యాక్‌డ్రాప్ అన్ని సరికొత్త‌గా ఉన్నాయి… క్రూరుడైన బింబిసారుడు లుక్‌లో యుద్ధ రంగంలో శ‌త్రు సైనికుల‌ను చంపి వారి శ‌వాల‌పై ఠీవిగా కూర్చున్న క‌ళ్యాణ్ రామ్ లుక్ టెరిఫిక్‌గా ఉంది. తొలిసారిగా క‌ళ్యాణ్ రామ్ ఇలాంటి మైథిలాజిక‌ల్ పాత్ర‌లో న‌టిస్తుండ‌టంతో పాటు, ఆ పాత్ర లుక్‌, బ్యాక్ డ్రాప్ సినిమాపై ఆస‌క్తిని పెంచుతున్నాయి.

‘గ‌తేడాది షూటింగ్‌ స్టార్ట్ చేశాం. విజువ‌ల్ ఎఫెక్ట్స్‌, గ్రాఫిక్స్ కీల‌కంగా.. భారీ సెట్స్‌తో క‌ళ్యాణ్ రామ్ కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న హై టెక్నిక‌ల్ వాల్యూస్ మూవీ ఇది. కరోనా ఉధృతి కారణంగా ప్రస్తుతం షూటింగ్ ఆగింది. కొవిడ్ ప‌రిస్థితులు కాస్త చ‌క్క‌బ‌డ‌గానే షూటింగ్‌ స్టార్ట్ చేస్తాం. ఈ ఏడాది ద్వితీయార్థంలో ‘బింబిసార’ చిత్రాన్ని విడుద‌ల చేయడానికి స‌న్నాహాలు చేస్తున్నాం’ అని చిత్ర యూనిట్ తెలియ‌జేసింది. కళ్యాణ్ రామ్ సరసన కెథరిన్ ట్రెసా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు.

ఈ చిత్రానికి పాట‌లు: సిరి వెన్నెల సీతారామ‌శాస్త్రి, రామ‌జోగ‌య్య శాస్త్రి, డాన్స్‌: శోభి, ర‌ఘు, ఫైట్స్‌: వెంక‌ట్‌, రామ‌కృష్ణ‌, వి.ఎఫ్‌.ఎక్స్‌: అనిల్ ప‌డూరి, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, మ్యూజిక్‌: చిరంత‌న్ భ‌ట్‌, సినిమాటోగ్ర‌ఫీ: ఛోటా కె.నాయుడు, ప్రొడ్యూస‌ర్‌: హ‌రికృష్ణ.కె, ద‌ర్శ‌క‌త్వం: వ‌శిష్ఠ్‌..