Nani: అంటే.. సుందరానికీ.. అక్కడ వదులుతారట!

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అంటే.. సుందరానికీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు....

Nani: అంటే.. సుందరానికీ.. అక్కడ వదులుతారట!

Nani Ante Sundaraniki Trailer Venue And Time Locked

Nani: నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘అంటే.. సుందరానికీ’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు వివేక్ ఆత్రేయ తనదైన మార్క్ కామెడీ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తుండగా, మలయాళ బ్యూటీ నజ్రియా ఈ సినిమాతో టాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోంది. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్, టీజర్ ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేసింది.

Nani: ‘అంటే.. సుందరానికీ’ ట్రైలర్ అప్‌డేట్ అప్పుడేనట!

అయితే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను జూన్ 2న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. అయితే ఈ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌ను జూన్ 2న సాయంత్రం 5 గంటలకు వైజాగ్‌లోని ఆంధ్రా యూనివర్సిటీలోని Sir CR Reddy Convocation Hallలో రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఓ పోస్టర్ ద్వారా వెల్లడించారు. ఈ సినిమాలో నాని, నజ్రియా మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని, వారి మధ్య నడిచే రొమాంటిక్ ట్రాక్ ఈ సినిమాకే హైలైట్‌గా ఉండబోతుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

Nani: నేచురల్ స్టార్‌ను ఊరమాస్‌గా మార్చనున్న డైరెక్టర్..?

ఇక ఈ సినిమాలో నాని చేసే కామెడీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడం ఖాయమని.. చాలా రోజుల తరువాత నాని ఇలా కామెడీతో కూడిన పాత్రలో మనకు కనిపిస్తాడని చిత్ర యూనిట్ అంటోంది. కాగా.. ఈ సినిమాకు వివేక్ సాగర్ అందించిన మ్యూజిక్ ఈ సినిమాకు మరో మేజర్ అసెట్ కానుందని చిత్ర యూనిట్ అంటోంది. ఈ సినిమాను జూన్ 10న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ సిద్ధమయ్యింది. మరి ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుంటుందో చూడాలి.