Narappa : ‘నారప్ప’ విడుదల వాయిదా.. సెకండ్ వేవ్ తగ్గాకే వదులుతామంటున్న నిర్మాతలు..

మే 14న ఈ సినిమాను రిలీజ్ చెయ్యనున్నామని ప్రకటించిన నిర్మాతలు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త తేదీ వెల్లడిస్తామని అధికారికంగా ప్రకటించారు..

Narappa : ‘నారప్ప’ విడుదల వాయిదా.. సెకండ్ వేవ్ తగ్గాకే వదులుతామంటున్న నిర్మాతలు..

Narappa Will Not Be Releasing On May 14th Says Producers

Narappa: కరోనా సెకండ్ వేవ్ టాలీవుడ్ ఇండస్ట్రీ మీద గట్టి దెబ్బే కొడుతోంది.. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయనుకుని దాదాపు 10 రోజుల పాటు పెద్ద, చిన్న సినిమాల విడుదల తేదీలతో కూడిన అప్‌డేట్స్‌తో సందడి చేసిన మేకర్స్.. ఇప్పుడు ఉసూరుమంటూ తమ సినిమాల రిలీజ్ డేట్స్ పోస్ట్ పోన్ అయ్యాయని, త్వరలో కొత్త తేదీ ప్రకటిస్తామని చెబుతున్నారు..

NARAPPA
‘ఎఫ్‌2’, ‘వెంకీమామ’ వంటి వరుస బ్లాక్‌బస్టర్‌ హిట్స్‌తో దూసుకెళ్తోన్న సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్‌, ప్రియమణి జంటగా.. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వంలో సురేష్‌ ప్రొడక్షన్స్‌ ప్రై.లి, వి క్రియేషన్స్‌ పతాకాలపై డి.సురేష్‌బాబు, కలైపులి ఎస్‌. థాను సంయుక్తంగా నిర్మిస్తున్న మూవీ ‘నారప్ప’..

మే 14న ఈ సినిమాను రిలీజ్ చెయ్యనున్నామని ప్రకటించిన నిర్మాతలు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు, పరిస్థితులు అదుపులోకి వచ్చిన తర్వాత కొత్త తేదీ వెల్లడిస్తామని అధికారికంగా ప్రకటించారు.. ఈ మేరకు సురేష్ ప్రొడక్షన్స్, వి క్రియేషన్స్ సంస్థలతో పాటు వెంకటేష్ కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేశారు..
‘నారప్ప’ విడుదలవకముందే మలయాళం సినిమా ‘దృశ్యం 2’ రీమేక్ కూడా కంప్లీట్ చేసేశారు వెంకీ..