Nasa Mars: మార్స్‌పై తొలిసారి నాసా హెలికాప్ట‌ర్ చక్క‌ర్లు.. వీడియో ఇదే..!

మనిషి భూమితో పాటు మరో గ్రహం మీద కూడా ఆవాసానికి ఏమైనా అవకాశం ఉందా అని చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ దిశగా ఎన్నో ఆవిష్కరణలు కూడా మనం చూసేశాం. అయితే, తొలిసారిగా మాన‌వ చ‌రిత్ర‌లో ఓ అపూర్వ ఘ‌ట్టాన్ని ఇప్ప‌టికే నాసా ఆవిష్క‌రించింది.

Nasa Mars: మార్స్‌పై తొలిసారి నాసా హెలికాప్ట‌ర్ చక్క‌ర్లు.. వీడియో ఇదే..!

Nasa Helicopter Rides On Mars For The First Time This Is The Video

Nasa Mars: మనిషి భూమితో పాటు మరో గ్రహం మీద కూడా ఆవాసానికి ఏమైనా అవకాశం ఉందా అని చాలా కాలంగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. ఇప్పటికే ఈ దిశగా ఎన్నో ఆవిష్కరణలు కూడా మనం చూసేశాం. అయితే, తొలిసారిగా మాన‌వ చ‌రిత్ర‌లో ఓ అపూర్వ ఘ‌ట్టాన్ని ఇప్ప‌టికే నాసా ఆవిష్క‌రించింది. తొలిసారి భూమిపై కాకుండా సౌర కుటుంబంలోని మ‌రో గ్ర‌హంపై హెలికాప్ట‌ర్ ఎగిరింది. ఏప్రిల్ 30వ తేదీన నాలుగోసారి విజ‌యవంతంగా మార్స్‌పై హెలికాఫ్టర్ ఎగిరింది. ప‌ర్సీవ‌రెన్స్ రోవ‌ర్‌తోపాటు మార్స్‌పైకి వెళ్లిన ఇన్‌జెన్యూయిటీ హెలికాప్ట‌ర్ ఇప్పుడు స్వేచ్ఛ‌గా మార్స్‌పై అటూ ఇటూ తిరుగుతోంది.

ఇప్పటి వరకు మార్స్ మీద పరిస్థితి ఎలా ఉంటుందన్నది ఛాయాచిత్రాల ద్వారానే అంచనా వేయగా ఇప్పుడు మార్స్ మీద చక్కట్లు కొట్టిన హెలికాఫ్టర్ మార్స్ మీద సౌండ్‌ను కూడా రోవ‌ర్ క్యాప్చ‌ర్ చేసి భూమిపైకి పంపించింది. ఆ స‌మ‌యంలో అది రోవ‌ర్‌కు 80 మీట‌ర్ల దూరంలో ఉంది. అంత దూరం నుంచి సౌండ్‌ను రికార్డు చేయ‌గ‌ల‌దో లేదో అని సైంటిస్టులు భావించినా ప‌ర్సీవ‌రెన్స్‌లోని మైక్ ఆ ప‌ని చేసి అక్కడి శబ్దాన్ని రికార్డు చేసింది. ఈ అద్భుత‌మైన 3 నిమిషాల ఆడియో, వీడియోను నాసా శుక్ర‌వారం రిలీజ్ చేసింది.

అంగారక గ్రహం-భూమికి మధ్య దూరం 28 కోట్ల కిలోమీటర్లు ఉండగా దిగ్విజయంగా ఈ యాత్రలో నాసా విజయం సాధించింది. జెజెరో క్రేట‌ర్‌లో ఈ అధ్బుతం ఆవిష్కృత‌మవగా నిమిషానికి 2400 సార్లు హెలికాప్ట‌ర్ బ్లేడ్లు తిరిగాయి. మొత్తం 262 మీట‌ర్ల దూరం ఇది ప్ర‌యాణించి మ‌ళ్లీ కిందికి దిగింది. అది రోవ‌ర్ నుంచి దూరంగా వెళ్లిన‌ప్పుడు సౌండ్ త‌గ్గ‌డం, ద‌గ్గ‌ర‌గా రాగానే పెర‌గ‌డం వీడియోలో గ‌మ‌నించ‌వ‌చ్చు. మార్స్ వాతావ‌ర‌ణం మ‌న భూవాతావ‌ర‌ణ సాంద్ర‌త‌లో కేవ‌లం ఒక శాతం మాత్ర‌మే ఉండడంతో అక్క‌డ చాలా నిశ్శ‌బ్దంగా ఉంటుంది.