Ante Sundaraniki : నాని భార్యతో కలిసి స్టెప్పులేసిన నజ్రియా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నాని..

ఇటీవలే అంటే సుందరానికి సినిమా నుంచి తందానానంద ప్రోమో సాంగ్ అంటూ ఓ పాటని రిలీజ్ చేయగా ఈ పాట బాగా వైరల్ అయింది. ఈ పాటలో చూపించిన విజువల్స్, స్టెప్పులు కూడా జనాలకి...................

Ante Sundaraniki : నాని భార్యతో కలిసి స్టెప్పులేసిన నజ్రియా.. మధ్యలో ఎంట్రీ ఇచ్చిన నాని..

Nani Wife

Ante Sundaraniki :  నాని హీరోగా, నజ్రియా హీరోయిన్ గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో అంటే సుందరానికి సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని ఫుల్ లెంగ్త్ కామెడీ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించగా జూన్ 10న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులని అలరిస్తున్నాయి. అంటే సుందరానికి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జూన్ 9 సాయంత్రం జరగనుంది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా వస్తుండటంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి.

Nayan-Vignesh : నయనతార-విగ్నేష్ శివన్ పెళ్లి వేడుకలు

ఇటీవలే అంటే సుందరానికి సినిమా నుంచి తందానానంద ప్రోమో సాంగ్ అంటూ ఓ పాటని రిలీజ్ చేయగా ఈ పాట బాగా వైరల్ అయింది. ఈ పాటలో చూపించిన విజువల్స్, స్టెప్పులు కూడా జనాలకి బాగా నచ్చాయి. ఇందులో నాని, నజ్రియా కలిసి వేసిన స్టెప్పులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఈ పాటకి నజ్రియా, నాని భార్య అంజనా కలిసి రీల్స్ రూపంలో స్టెప్పులేశారు. చివర్లో నాని కూడా జత చేరి వీరితో కలిసి స్టెప్పులేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.