ఏం మలినేని.. మే లో మొదలెడదామా!

ఏం మలినేని.. మే లో మొదలెడదామా!

NBK 107: నటసింహా నందమూరి బాలకృష్ణ, ఇటీవల ‘క్రాక్’ తో బ్లాక్‌బస్టర్ అందుకున్న డైరెక్టర్ గోపిచంద్ మలినేని కాంబోలో సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ సినిమా ప్లాన్ చేస్తోంది. బాలయ్య ఇమేజ్‌ని దృష్టిలో పెట్టుకుని గోపిచంద్ మంచి కథ తయారుచేస్తున్నారని, బాలయ్య-బోయపాటి సినిమా తర్వాత ఈ సినిమా స్టార్ట్ చేస్తామని మైత్రీ నిర్మాతలు ఇటీవలే అధికారికంగా ప్రకటించారు..

ఇక రీసెంట్‌గా డైరెక్టర్ గోపిచంద్, బాలయ్య బాబుని ఆయన నివాసంలో కలిశారు. ‘క్రాక్’ మంచి విజయం సాధించినందుకు బాలయ్య, గోపిచంద్‌ని అభినందించారు. అలాగే తమ కలయికలో తెరకెక్కబోతున్న సినిమా గురించి మాట్లాడారు.

ఈ సందర్భంగా బాలయ్య, గోపిచంద్ కలిసి ఉన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.. ఉగాది సందర్భంగా ఏప్రిల్ 13న సినిమాను లాంఛనంగా ప్రారంభించి, మే నెలనుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టనున్నారు. కాగా బాలయ్య, బోయపాటి సినిమా మే 28న విడుదల కానుంది..

 

NBK 107