Aryan Khan Gets Bail : సినిమా అప్పుడే అయిపోలేదన్న మాలిక్!

ఆర్యన్ కు బెయిల్ లభించడంపై ఎన్ సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ‘పిక్చర్ అభీ బాకీ హై..మేరా దోస్త్’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది.

Aryan Khan Gets Bail : సినిమా అప్పుడే అయిపోలేదన్న మాలిక్!

Nawab Malik

Updated On : October 28, 2021 / 9:03 PM IST

NCP Leader Nawab Malik : బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ కు ఎట్టకేలకు బెయిల్ దొరికింది. 2021, అక్టోబర్ 28వ తేదీ గురువారం బాంబే హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. డ్రగ్స్ కేసులు ఆర్యన్ అరెస్టు అయిన సంగతి తెలిసిందే. దాదాపు అతను 20 రోజులు జైలులో గడపాల్సి వచ్చింది. మూడు సార్లు బెయిల్ పిటిషన్ లు దాఖలు చేసినా..కోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలో..ఆర్యన్ కు బెయిల్ లభించడంపై ఎన్ సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ ట్విట్టర్ వేదికగా ఓ ట్వీట్ చేశారు.

Read More : Aryan Khan : డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్

ఈ ట్వీట్ వైరల్ అవుతోంది. బెయిల్ వచ్చిన వెంటనే ఆయన ట్వీట్ చేశారు. షారుఖ్ ఖాన్ నటించిన ఓం శాంతి ఓం సినిమాలోని ఫేమస్ డైలాగ్ ‘పిక్చర్ అభీ బాకీ హై..మేరా దోస్త్’ అంటూ ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఎన్ సీబీ డైరెక్టర్ సమీర్ వాంఖడేని ఉద్దేశించే నవాబ్ మాలిక్ ఈ ట్వీట్ చేసి ఉండొచ్చని నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Read More : Mumbai Cruise Drug Case : ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటీషన్ పై నేడు రెండో రోజు విచారణ

ఎందుకంటే..ఆయన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో జనరల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై గత కొన్ని రోజులుగా సంచలన ఆరోపణలు చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు..ఆర్యన్ తో పాటు..ఆర్బాజ్ మర్చంట్, మున్ మున్ ధమేచాలాకు సింగిల్ బెంచ్ జస్టిస్ ఎన్ వీ సంబ్రే బెయిల్ మంజూరు చేశారు.