Smart Phone : 44 కోట్లకు చేరువలో భారత్ లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు

ప్రధానంగా భారత్ వంటి దేశాల్లో సెల్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది.

Smart Phone : 44 కోట్లకు చేరువలో భారత్ లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు

స్మార్ట్ ఫోన్ వినియోగంలో..44కోట్లకు చేరువలో

Smart Phone : ఒకప్పుడు ఫోనంటే చాలా విలాస వంతమైన సౌకర్యంగా అంతా భావించే వారు. అయితే టెక్నాలజీ రంగంలో వచ్చిన అనేక మార్పులు ఫోన్ సౌకర్యాన్ని సామాన్యులు సైతం అందుకునేలా చేశాయి. ప్రస్తుతం సెల్ ఫోన్ వినియోగం అనేది నిత్యావసర జాబితాలో చేరిపోయింది. ప్రతి ఒక్కరి చేతిలో నేడు సెల్ ఫోన్ కనిపిస్తోంది. అదిలేకుండా రోజు గడవని పరిస్ధితి. బహుళ ప్రయోజనాలు కలిగిన సెల్ ఫోన్ సౌకర్యవంతంగా ఉండటమేకాక, మనిషి మనుగడకు ఇప్పుడది దిక్సూచిగా మారిపోయింది.

ప్రధానంగా భారత్ వంటి దేశాల్లో సెల్ ఫోన్ వినియోగించే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. కరోనా పరిస్ధితుల నేపధ్యంలో చిన్నారుల చదువుల నుండి పెద్దల ఉద్యోగ, వ్యాపార వ్యవహారాల వరకు అన్నీ ఆన్ లైన్ కావటంతో సెల్ ఫోన్ పైనే ఎక్కువగా అధారపడాల్సి వస్తుంది. న్యూజ్ అనే సంస్ధ అంచనాల ప్రకారం భారతదేశంలో స్మార్ట్ ఫోన్లు వాడే వారి సంఖ్య 43.9 కోట్లకు చేరింది. అంటే 44కోట్లకు చేరువలో భారతదేశం ఉందన్నమాట.  91 కోట్లకు పైగా స్మార్ట్ ఫోన్ వినియోగదారులతో చైనా మొదటి స్ధానంలో ఉండగా, 44 కోట్లతో దాని తరువాత స్ధానంలో భారత్ ఉంది. మూడవస్ధానంలో అమెరికా ఉండగా ఆతరువాత స్ధానాల్లో ఇండోనేషియా, బ్రెజిల్, రష్యా, జపాన్, మెక్సికో దేశాలు ఉన్నాయి.

రానున్న రోజుల్లో స్మార్ట్ ఫోన్ల వినియోగం మరింత పెరిగే అవకాశం ఉందన్న అంచనా వేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కలిగిన వారు ప్రతిరోజు నిద్రలెగవగానే సెల్ ఫోన్ నే, చూస్తున్నట్లు పలు పరిశోధనల్లో తేలింది. దీని ద్వారా తమ కార్యకలాపాలు చక్కబెట్టుకోవటం సులభతరంగా ఉన్నప్పటికీ , తెలియకుండానే స్మార్ట్ ఫోన్ తో రోజును గడిపేస్తున్నట్లు  పలు సర్వేల్లో వెల్లడైంది. పెరిగిన స్మార్ట్ ఫోన్ల వినియోగం వల్ల లాభాలతోపాటు నష్టాలు ఉన్నాయని నిపుణులు అంటున్నారు. అత్యధిక సమయం స్మార్ట్ ఫోన్ తో గడిపితే అనారోగ్య సమస్యలు ఖాయమన్న హెచ్చరికలు చేస్తున్నారు.