Air India: రెండు వారాలకే ఎయిరిండియా సీఈఓ జాబ్ వదిలేసిన ఇల్కర్ ఐసీ

టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియాకు సీఈఓను నియమించిన రెండు వారాలకే రాజీనామా ప్రకటించేశారు కొత్త సీఈఓ. గతంలో ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ పదవిని....

Air India: రెండు వారాలకే ఎయిరిండియా సీఈఓ జాబ్ వదిలేసిన ఇల్కర్ ఐసీ

Air India

Air India: టాటా గ్రూప్ కు చెందిన ఎయిరిండియాకు సీఈఓను నియమించిన రెండు వారాలకే రాజీనామా ప్రకటించేశారు కొత్త సీఈఓ. గతంలో ఉన్న రాజకీయ సంబంధాల కారణంగా టర్కీకి చెందిన ఇల్కర్ ఐసీ పదవిని తిరస్కరించినట్లు తెలుస్తుంది. టాటా సంస్థల్లో ఒకటైన ఎయిరిండియా ఫిబ్రవరి 14న కొత్త సీఈఓగా ఇల్కర్ ఐసీ పేరును ప్రకటించింది.

గత వారం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్)కు చెందిన బీజేపీ ఐడియాలాజికల్ మెంటార్ ఐసీ అపాయింట్మెంట్ ను బ్లాక్ చేయాలంటూ డిమాండ్ చేశారు. టర్కీలోని రాజకీయ సంబంధాల కారణంగా న్యూఢిల్లీలో ఇబ్బందులు ఎదురవుతాయని సూచించాడు.

వాస్తవానికి ఐసీ టర్కిష్ ఎయిర్‌లైన్స్ కు మాజీ ఛైర్మన్.. అంతేకాకుండా 1994లో తయ్యిప్ ఎర్డోగన్ కు అడ్వైజర్ గా వ్యవహరించారు. ఆ సమయంలో ప్రస్తుత టర్కిష్ ప్రెసిడెంట్ ఇస్తాంబుల్ కు మేయర్ గా ఉన్నారు.

Read Also : ఎయిరిండియా సిబ్బందికి కొత్త రూల్స్‌

టాటా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ తో జరిగిన రీసెంట్ మీటింగ్ లో ఇండియన్ మీడియాలో తన అపాయింట్మెంట్ గురించి వస్తున్న వార్తలరీత్యా తాను తప్పుకుంటున్నట్లు తెలిపాడు.

‘ప్రొఫెషనాలిటీకి ఎల్లప్పుడూ ప్రాధాన్యతనిచ్చే వ్యాపార నాయకుడిగా … ఈ స్థానాన్ని అంగీకరించడం, ఆచరణీయం లేదా గౌరవప్రదమైన నిర్ణయం కాదనుకుంటున్నాను” అని ఐసీ చెప్పారు.

ఈ విషయాన్ని ఎయిరిండియా సంస్థ కూడా ధ్రువీకరిస్తున్నట్లు అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. కొత్త సీఈఓ వేట మొదలుపెడుతున్నామని త్వరలోనే ఎయిరిండియా కొత్త సీఈఓ పేరు ప్రకటిస్తామని చెప్పారు.