New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

ఒకప్పటిలా సినిమా సక్సెస్ అవ్వాలంటే.. తల నెరిసిన డైరెక్టర్లు అవసరం లేదు.. ఇప్పుడిప్పుడే టీనేజ్ దాటిన వాళ్లు, నిండా 30 కూడా నిండకుండానే బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు.

New Directors: కంటెంట్‌తో కొడుతున్న కొత్త దర్శకులు.. ప్రయోగాలు చేస్తున్న హీరోలు!

New Directors (1)

New Directors: ఒకప్పటిలా సినిమా సక్సెస్ అవ్వాలంటే.. తల నెరిసిన డైరెక్టర్లు అవసరం లేదు.. ఇప్పుడిప్పుడే టీనేజ్ దాటిన వాళ్లు, నిండా 30 కూడా నిండకుండానే బ్లాక్ బస్టర్ హిట్లు కొడుతున్నారు. కంటెంట్ ఉండాలే కానీ.. కొత్త డైరెక్టర్ అయినా పర్లేదనుకుంటున్నారు మన హీరోలు. అందుకే స్టార్ హీరోల నుంచి యంగ్ డైరెక్టర్ల వరకూ కొత్త హీరోలతో కలిసి సినిమాలు చేస్తున్నారు. అలా న్యూఏజ్ డైరెక్టర్లతో ప్రయోగాలు చేస్తున్న హీరోలెవరో డీటెయిల్స్ లోకి వెళదాం.

New Directors: ఏదో తడబాటు.. ఛాన్సిచ్చినా వాడుకోని డైరెక్టర్లు

రొటీన్ మాస్ కమర్షియల్స్ చూడడం జనాలు ఎప్పుడో మానేశారు. టాలీవుడ్ కూడా సో కాల్డ్ సినిమాలు చెయ్యడం ఎప్పుడో మానేసింది. అందుకే కొత్త కొత్త కాన్సెప్ట్ తో సరికొత్తగా సిల్వర్ స్క్రీన్ మీద కొస్తున్నారు హీరోలు. ఫ్రెష్ నెస్ కోసం కొత్త కొత్త డైరెక్టర్లతో కొలాబరేట్ అవుతున్నారు మన హీరోలు. ఎప్పటికప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో ఆడియన్స్ ని ఎంగేజ్ చెయ్యబోతున్నారు. స్పెషల్లీ మాస్ కమర్షియల్స్ చేసే రవితేజ.. రామారావ్ గా మారిపోయి కొత్తగా కనిపిస్తున్నారు. రవితేజ తన 68వ సినిమా రామారావ్ ఆన్ డ్యూటీ సినిమా రిలీజ్ కి రెడీ అవుతున్నారు. గవర్నమెంట్ సర్వెంట్ క్యారెక్టర్ లో పవర్ ఫుల్ గా కనిపించబోతున్న రవితేజ.. ఈసినిమాని శరత్ మండవ అనే కొత్త డైరెక్టర్ తో చేశారు. రవితేజ మార్క్ పవర్ పంచ్ లతో తెరకెక్కిన రామారావ్ ఆన్ డ్యూటీ సినిమాలో మరోసారి మాస్ మోత మోగించబోతున్నారు.

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న నాని కొత్త డైరెక్టర్ని తన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ సారి దసరా మామూలుగా ఉండదంటూ మిగతా సినిమాలకు ధమ్కీ ఇచ్చిన నానిని సరికొత్తగా చూపించబోతున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో దసరా టైటిల్ తో షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ మూవీ నానికెరీర్ లోనే కంప్లీట్ కాంట్రాస్ట్ గా లుక్ వైజ్, అప్పియరెన్స్ వైజ్, లాంగ్వేజ్ వైజ్ సరికొత్తగా తెరకెక్కుతోంది. అంతలా నానీని ట్రాన్స్ ఫామ్ చేసి సర్ ప్రైజ్ ఇచ్చారు శ్రీకాంత్.

Tamil Directors: పెద్ద సినిమాల్ని హ్యాండిల్ చెయ్యలేకపోతున్న యంగ్ డైరెక్టర్లు

స్టార్టింగ్ నుంచి సినిమాల విషయంలో పెద్దగా ప్రయోగాలు చెయ్యని కళ్యాణ్ రామ్ ఫస్ట్ టైమ్ తన స్టైల్ మార్చుకుని టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నారు. ఇంత వెయిట్ ఉన్న సినిమా చేస్తున్నది.. కనీసం 10 సినిమాలన్నా చేసిన ఎక్స్ పీరియన్స్ డైరెక్టర్ కాదు.. ఒక్క సినిమా కూడా చెయ్యని యంగ్ డైరెక్టర్ వశిష్ట మల్లిడి. బింబిసారగా తిగర్తల రాజ్యాదిపతిగా రూత్ లెస్ క్యారెక్టర్ లో కనిపిస్తున్న కళ్యాణ్ రామ్.. టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టూ గుడ్ ట్యాగ్ తో రిలీజ్ అవుతోంది.

Telugu Directors: కథే కీలకం.. ప్రభాస్ లాంటి స్టార్‌ను కూడా పట్టేస్తున్న యంగ్ డైరెక్టర్‌లు!

సాయిధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. దాదాపు సంవత్సరం తర్వాత కార్తీక్ అనే కొత్త డైరెక్టర్ తో సుకుమార్ ప్రొడక్షన్ లో కొత్త సినిమాని స్టార్ట్ చేశారు సాయిధరమ్ తేజ్. ఎక్స్ పెరిమెంట్స్ చెయ్యడానికి ఎప్పుడూ రెడీగా ఉండే సాయిధరమ్ తేజ్.. కార్తీక్ డైరెక్షన్లో మిస్టిక్ ధ్రిల్లర్ సినిమా చేస్తున్నారు.

New Villains: హైలెట్‌గా విలనిజం.. అందుకోసమే స్టైలిష్ స్టార్స్!

డిఫరెంట్ మూవీ స్ చేసే శర్వానంద్ కూడా తన అప్ కమింగ్ మూవీతో కొత్త డైరెక్టర్ ని పరిచయం చేస్తున్నారు. శర్వానంద్, రీతూవర్మ జంటగా కార్తీక్ డైరెక్షన్లో తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా తెరకెక్కుతోంది. సైన్స్ ఫిక్షన్ డ్రామా మూవీ ఒకే ఒక జీవితం. టైటిల్ సింపుల్ గా ఉన్నా.. సినిమాలో మాత్రం ఇంట్రస్టింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు టీమ్.

Telugu Young Directors: స్టార్ హీరోలను ఫిదా చేస్తున్న యంగ్ డైరెక్టర్స్..!

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న మరో యంగ్ డైరెక్టర్ నాగశౌర్య కూడా కొత్త డైరెక్టర్ తోనే సినిమా చేస్తున్నారు. లేటెస్ట్ గా పవన్ బసం శెట్టిని డైరెక్టర్ గా పరిచయం చేస్తూ.. కొత్త సినిమాల మొదలుపెట్టారు. అంతేకాదు.. మరో కొత్త డైరెక్టర్ తోనే పోలీస్ వారి హెచ్చరిక సినిమా కూడా చేస్తున్నారు నాగశౌర్య.

Tollywood Heroes: పాన్ ఇండియా సినిమాలు.. తెలుగు హీరోల హిందీ తిప్పలు!

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ కూడా కొత్త డైరెక్టర్ తోనే రంగ రంగ వైభవంగా సినిమా చేస్తున్నాడు. సందీప్ రెడ్డి వంగా శిష్యుడిగా తమిళ్ లో ఆదిత్మ వర్మ మూవీ చేసిన గిరీశయ్య.. తెలుగులో మాత్రం వైష్ణవ్ తేజ్ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. కేతిక శర్మ జంటగా కంప్లీట్ యూత్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన రంగరంగ వైభవంగా సినిమా త్వరలోనే రిలీజ్ కు రెడీ అవుతోంది.

Story Based Movies: రూటు మార్చి కాన్సెప్ట్ తో కొడుతున్న చిన్న హీరోలు!

మరో యంగ్ హీరో కూడా కొత్త డైరెక్టర్ సతీష్ త్రిపురతో దొంగలున్నారు జాగ్రత్త సినిమా చేస్తున్నారు. మత్తు వదలరా, తెల్లవారితే గురువారం సినిమాలు చేసిన కీరవాణి కొడుకు శ్రీసింహ హీరోగా కొత్త సినిమా స్టార్టయ్యింది. సురేష్ ప్రొడక్షన్స్ లో దొంగలున్నారు జాగ్రత్త అనే క్రేజీ కంటెంట్ తో కొత్తసినిమా మేకింగ్ లో బిజీగా ఉన్నాడు సింహ.