Tollywood Heroes: పాన్ ఇండియా సినిమాలు.. తెలుగు హీరోల హిందీ తిప్పలు!

తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హీరోలైపోయారు. తెలుగు సినిమాలు నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ప్రమోషన్లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో..

Tollywood Heroes: పాన్ ఇండియా సినిమాలు.. తెలుగు హీరోల హిందీ తిప్పలు!

Tollywood Heroes

Tollywood Heroes: తెలుగు సినిమా రేంజ్ మారిపోయింది. టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా హీరోలైపోయారు. తెలుగు సినిమాలు నేషనల్ వైడ్ గా రిలీజ్ అవుతున్నాయి కాబట్టి.. ప్రమోషన్లు కూడా పాన్ ఇండియా రేంజ్ లో చెయ్యాల్సి ఉంటుంది. సౌత్ ప్రమోషన్స్ పెద్దగా ప్రాబ్లమ్ ఉండదు కానీ.. పెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ లో మాత్రం హిందీలో మాట్లాడి ఆడియన్స్ కి దగ్గరవ్వాలనుకుంటున్నారు హీరోలు. దాని కోసం ఎన్నో తిప్పలు పడుతున్నారు.

Tollywood Star Heroes: లేట్‌కమర్స్.. ఏళ్లకు ఏళ్ళు కనిపించని స్టార్ హీరోలు!

పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలు చేస్తూ.. తెలుగు సినిమాని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళుతున్నారు మన స్టార్ హీరోలు. నేషనల్ వైడ్ సినిమాలు కాబట్టి పెద్ద మార్కెట్ అయిన బాలీవుడ్ ని ప్రమోషన్లతోనే ఇంప్రెస్ చెయ్యాల్సి ఉంటుంది. దాని కోసం హిందీలో మాట్లాడడానికి తెగ కష్టపడుతున్నారు ప్రభాస్. సౌత్ హీరోలకు హిందీ టచ్ కాస్త తక్కువే. అయినా సరే హిందీలో మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు ప్రభాస్.

Tollywood Stars: హీరోయిన్ల కొరత.. సినిమాలున్నా స్టార్ హీరోల వెయిటింగ్!

హిందీ మాట్లాడినా.. అది నార్త్ సైడ్ హిందీ అంత ప్రాపర్ స్లాంగ్ అయితే రాదు.. కానీ అక్కడ సినిమాలు కూడా ప్యార్లల్ గా చేస్తున్నారు కాబట్టి.. కొద్దోగొప్పో నేర్చుకోవడానికి ట్రై చేస్తున్నారు. రామ్ చరణ్ కూడా ప్రభాస్ లానే ఇబ్బంది పడుతున్నారు. మాట్లాడితే కరక్ట్ గా ఉంటుందో లేదో, ఆడియన్స్ కి రీచ్ అవుతుందో లేదో అని టెన్షన్ టెన్షన్ గానే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో మాట్లాడారు చరణ్.

Tollywood Actress: ముంబైలో తెగ సందడి చేస్తున్న టాలీవుడ్ హీరోయిన్స్!

చరణ్ హిందీ మాట్లాడడానికి ఇబ్బందిపడుతుంటే.. ఎన్టీఆర్ మాత్రం.. ఫ్లూయెంట్ గానే హిందీ మాట్లాడుతూ ప్రెస్ మీట్స్ ని లాగించేశారు. ఎంత కాదనుకున్నా.. మన హీరోలకు హైదరాబాద్ హిందీ స్లాంగ్ యాడ్ అవుతుంది కాబట్టి.. హిందీని బాలీవుడ్ లో మాట్లాడడానికి అంత కన్వీనియెంట్ గా ఫీలవ్వరు మన హీరోలు. కానీ ఒక్కోసారి మాట్లాడకతప్పదు కాబట్టి.. ఫ్లోలో మాట్లాడేస్తూ.. ఆడియన్స్ ని ఆకట్టుకునే పనిలో ఉన్నారు.

Tollywood Love Stories: అంతా ప్రేమమయం.. ప్రేమలో మునిగితేలుతున్న టాలీవుడ్!

రౌడీ హీరో విజయ్ దేవరకొండ.. తెలుగులో హీరోగా ఇంకా బిజీ అవ్వకముందే.. హిందీలో సినిమాలు చేస్తున్నాడు. కరణ్ జోహార్ ప్రొడక్షన్ లో తెరకెక్కుతున్నలైగర్ మూవీ బాలీవుడ్ లో కూడా గ్రాండ్ గా రిలీజ్ అవుతోంది. అయితే విజయ్ కి హిందీ ప్రాబ్లమ్ లేదు. ప్రోపర్ తెలంగాణ.. అందులోనూ హైదరాబాదీ కాబట్టి.. తన హిందీతోనే బాలీవుడ్ లో నడిపించేస్తున్నాడు.

Tollywood Directors: తెలుగు సినిమాని కొత్తగా చూపిస్తున్న రూల్స్ బ్రేకర్స్!

సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఇప్పటి వరకూ పాన్ ఇండియా సినిమా చెయ్యకపోయినా.. బాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. బాలీవుడ్ హీరోయిన్లతో సినిమాలు చేస్తూనే ఉన్నారు మహేష్. ఫ్యూచర్ లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనౌన్స్ మెంట్ తో అక్కడ హిందీలో మాట్లాడాల్సి ఉంటుంది. కానీ మహేష్ బాబుకు మాత్రం హిందీలో అంతగా ఫ్లూయెన్సీ లేదు. మరి బాలీవుడ్ లో హిందీని ఎలామేనేజ్ చేస్తారో అని ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు ఫాన్స్.

Tollywood : టాలీవుడ్‌లో ఫుల్ జోష్.. విడుదలకు క్యూ కడుతున్న పెద్ద సినిమాలు..

పుష్ప ఎంట్రీతోనే బాలీవుడ్ లో మకాం వేసేసిన బన్నీ.. అంతకుముందు బాలీవుడ్ లో ప్రమోషన్లు చెయ్యకపోయినా.. ఆడియన్స్ ని మీడియాని తన హిందీతో ఫుల్ గా ఇంప్రెస్ చేసేశాడు. ఎంత కాదనుకున్నా.. మన స్టార్లు మాట్లాడే హిందీ కి ఆ సౌత్ ఇండియన్ న్ స్లాంగ్ టచ్ ఉంటుంది కాబట్టి.. ఎక్కడ ట్రోల్ చేస్తారో అని మాట్లాడడానికి హెజిటేట్ చేస్తుంటారు. కానీ పుష్పకి తన స్టైల్లో బాగానే కవర్ చేశారు బన్నీ.