Tollywood Directors: తెలుగు సినిమాని కొత్తగా చూపిస్తున్న రూల్స్ బ్రేకర్స్!

తెలుగు సినిమాకు తమ సినిమాలతో కొత్తలుక్ ఇచ్చి, ఇంకాస్త అందంగా కనిపించేలా చేస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు.

Tollywood Directors: తెలుగు సినిమాని కొత్తగా చూపిస్తున్న రూల్స్ బ్రేకర్స్!

Tollywood Directors

Tollywood Directors: తెలుగు సినిమాకు తమ సినిమాలతో కొత్తలుక్ ఇచ్చి, ఇంకాస్త అందంగా కనిపించేలా చేస్తున్నారు కొంతమంది డైరెక్టర్లు. రొటీన్ సినిమాలు కాకుండా పాత్ బ్రేకింగ్ మూవీస్ చేస్తూ.. ట్రెండ్ సెట్ చేస్తున్నారు న్యూ ఏజ్ డైరెక్టర్స్. క్వాలిటీ మూవీ మేకింగ్ తో తెలుగు సినిమాని ఎలివేట్ చేస్తూ.. స్టార్ హీరోలతో సినిమా ఆఫర్లను కొట్టేస్తూ.. టాలీవుడ్ ని నెక్ట్స్ లెవల్ కి తీసుకెళ్తున్నారు కొందరు దర్శకులు.

Celebrities Divorce: విడాకులందు.. సినిమా వాళ్ళ విడాకులు వేరయా!

టాలీవుడ్ లో సో కాల్డ్ కమర్షియల్ సినిమాల మేకింగ్ ను బ్రేక్ చేస్తూ.. అప్పుడప్పుడే కొత్త కధలు, కొత్త మేకింగ్ స్టైల్ అడాప్ట్ చేసుకుంటూ కొత్త పాత్ క్రియేట్ చేస్తున్నారు ఈ న్యూ ఏజ్ డైరెక్టర్స్. ఈ లిస్ట్ లో ఫస్ట్ ఉన్న నాగాశ్విన్ డిఫరెంట్ సినిమాలు చేసి ఒక కొత్త పాత్ ని క్రియేట్ చేశాడు. హీరో అంటే సోకాల్డ్ హీరోయిజం చూపించాలి.. ఫైట్స్ చెయ్యాలి లాంటి రొటీన్ రూల్స్ లేకుండా.. జస్ట్.. కథను మాత్రమే హీరోగా చూపించాడు నాగాశ్విన్. ఎవడే సుబ్రహ్మణ్యం సినిమాతో పాటు.. సావిత్రి జీవితకథ ఆధారంగా తీసిన మహానటి సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు. అంత పెద్ద నటి బయోపిక్ తీసినా.. ఎటువంటి కాంట్రవర్శీలను ఎదుర్కోకుండా విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న నాగాశ్విన్ ఇప్పుడు ప్రభాస్ తో ప్రాజెక్ట్ కె అనే భారీ బడ్జెట్ మూవీ చేస్తున్నారు.

Venky Kudumula Film: హీరోయిన్ దొరికేసినట్లే.. మెగాస్టార్ జోడీగా మాళవికా

తెలుగు సినిమాలో పాత్ బ్రేకింగ్ మూవీ.. అర్జున్ రెడ్డి. ఈ సినిమాతో డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అయిన సందీప్ రెడ్డి.. అప్పటి వరకూ టాలీవుడ్ లో ఉన్న సోకాల్డ్ హీరోలను ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చాలా బోల్డ్ గా సినిమా తీశాడు. అసలు తెలుగు సినిమా చరిత్రలో ఇలాంటి సినిమా రాగలదా అని ఊహించేలోపే అలాంటి హార్డ్ కోర్ సినిమా చేసి ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేశాడు సందీప్ రెడ్డి. టాలీవుడ్ సోకాల్డ్ మూవీ మేకింగ్ రూల్స్ ని బ్రేక్ చేసి ట్రెండ్ క్రియేట్ చేసిన డైరెక్టర్ గా సందీప్ మంచి క్రెడిట్ సాధించాడు. ఇదే సినిమా బాలీవుడ్ కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు సందీప్. ఇప్పుడు రణవీర్ సింగ్ తో పాటు ప్రభాస్ తో సినిమాలతో బిజీగా ఉన్నాడు సందీప్.

Jr NTR: ముహూర్తం పెట్టేసిన యంగ్ టైగర్.. ఇక నాన్ స్టాప్ లెక్కే!

చేసింది ఒకే ఒక్క సినిమా.. ఆ సినిమా కూడా అంతగా ఆడియన్స్ కి రీచ్ అవ్వలేదు. కానీ సినిమా మీద ఉన్న ప్రేమ, కథ మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో 15 ఏళ్ల తన కలని సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు రాధాకృష్ణ. 300 కోట్లకు పైగా బడ్జెట్ తో.. పాన్ ఇండియా స్టార్ తో .. తన ప్యాషన్ ని డిఫరెంట్ గా డేరింగ్ గా రాధేశ్యామ్ సినిమాగా ఆడియన్స్ కి అందించబోతున్నారు ఈ యాస్పిరెంట్ డైరెక్టర్.

Nikki Tamboli: బాబోయ్.. పోజులతోనే పిచ్చెక్కించేస్తుందే!

సినిమా అంటే 6 పాటలు, 4 ఫైట్లు అనే రొటీన్ ఫార్ములా ని బ్రేక్ చేసి.. సినిమా అంటే ఆడియన్ ని ఎమోషన్ తో ఎంగేజ్ చేసేస్తున్నాడు మరో న్యూ ఏజ్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి. చిలసౌ, మళ్లీరావా, తర్వాత జెర్సీ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న గౌతమ్.. ఇదే సినిమాని షాహిద్ కపూర్ తో హిందీలో కూడ రీమేక్ చేశారు. ఈ టాలెంట్ చూసే రామ్ చరణ్ .. తనతో నెక్ట్స్ సినిమా చేసే ఛాన్సిచ్చారు.

Srikanth Addala: బాలయ్యతో క్లాస్ దర్శకుడి కథా చర్చలు.. సెట్టయ్యేనా?

రానా, కెకె మీనన్‌, తాప్సీ లీడ్ రోల్స్ లో ఘాజీని తెరకెక్కించి ఫస్ట్ మూవీతోనే సంకల్ప్‌రెడ్డి ఘనవిజం సాధించాడు. 1971లో జరిగిన రియల్ ఇన్సిడెంట్ ఆధారంగా తెరకెక్కిందీ ఘాజీ. ఈ సినిమాకు నేషనల్ వైడ్ గా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ సినిమాతోనే అంత పెద్ద సబ్జెక్ట్ ని డీల్ చేసి అంతే ఎమోషనల్ గా సినిమాని తెరకెక్కించి కొత్త డైరెక్టర్లు ప్రయోగాలు చెయ్యొచ్చని ప్రూవ్ చేశాడు. తర్వాత వచ్చిన అంతరిక్షం కూడా ఇదే రేంజ్ లో పేరు తెచ్చిపెట్టింది. ఇప్పుడు బాలీవుడ్ లో మరో రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా సినిమా చేస్తున్నారు సంకల్ప్ రెడ్డి.

KGF2: దేశాన్ని ఊపేసిన పాట.. ఐటెం భామగా అనన్య!

సినిమా అంటే ఇంత సింపుల్ గా ఉంటుందా..? ఒక ఎలివేషన్ షాట్ లేదు.. ఒక గ్రాండియర్ లేదు.. ఒక బిల్డప్ లేదు.. కానీ సినిమా తీసేసి హిట్ కొట్టొచ్చని ప్రూవ్ చేశారు తరుణ్ బాస్కర్. సింపుల్ స్కీన్ ప్లే, అంతకన్నా సింపుల్ గా ఉండే క్యారెక్టర్స్, జస్ట్ మామూలుగా మాట్లాడుకుంటున్నట్టు ఉండే డైలాగ్స్.. మొత్తం కలిపి.. మన ఇంట్లో, సమాజంలో జరిగే సింపుల్ ఇన్సిడెంట్స్ తో పెళ్ళి చూపులు సినిమా తీసి.. ఫస్ట్ సినిమాతోనే నేషనల్ అవార్డ్ కొట్టేశారు తరుణ్ భాస్కర్. ఇలా టాలీవుడ్ లో తరుణ్ ని చూసి చాలా మంది డైరెక్టర్లు తమ ప్రయోగాలను తెరమీదకు తెచ్చారు.

RRR-DON : ఈవెంట్‌కి పిలిచి ఆ హీరో సినిమా డేట్‌కే ఎసరు పెట్టేశాడా రాజమౌళి!

రాహుల్ సాంకృత్యన్ కూడా యాస్పిరెంట్ డైరెక్టర్ గా కొత్త మూవీ మేకింగ్ ని ఆడియన్స్ ని పరిచయం చేస్తున్నారు. టాక్సీవాలాతో సమ్ థింగ్ డిఫరెంట్ గా ఉన్న స్టోరీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తే.. లేటెస్ట్ గా వచ్చిన శ్యామ సింగరాయ్ తో మరో ఇంట్రస్టింగ్ మూవీ చేశారు. రొటీన్ కమర్షియల్ సినిమా కాకుండా ఆడియన్స్ ని డిఫరెంట్ గా ఎంగేజ్ చేసేలా సినిమాలు చేస్తున్నారు రాహుల్.