Story Based Movies: రూటు మార్చి కాన్సెప్ట్ తో కొడుతున్న చిన్న హీరోలు!

సక్సెస్ ఊరికే వస్తుందా..? దానికోసం కష్టపడాలి. అయితే కష్టపడినా కూడా ఒక్కోసారి సక్సెస్ రాదు. అలాంటప్పుడు మరీ ఎక్కువ కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చెయ్యాలి.

Story Based Movies: రూటు మార్చి కాన్సెప్ట్ తో కొడుతున్న చిన్న హీరోలు!

Story Based Movies

Story Based Movies: సక్సెస్ ఊరికే వస్తుందా..? దానికోసం కష్టపడాలి. అయితే కష్టపడినా కూడా ఒక్కోసారి సక్సెస్ రాదు. అలాంటప్పుడు మరీ ఎక్కువ కష్టపడకుండా స్మార్ట్ వర్క్ చెయ్యాలి. అందుకే రొటీన్ సినిమాలు చేస్తూ.. బోర్ కొట్టిస్తున్న చిన్న హీరోలు.. కాన్సెప్ట్ తో కొడుతున్నారు. కొత్త కొత్త కథలతో సినిమాల మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్నారు.

Film Directors: బీవీఎస్ రవి-హరీష్ శంకర్ ట్విట్టర్ వార్.. అసలేం జరిగింది?

మన హీరోలు మారుతున్నారు. రొటీన్ ఫార్ములాస్ తో కమర్షియల్ సినిమాలు చేసే స్టార్ హీరోల దగ్గరనుంచి చిన్న హీరోల వరకూ రూట్ మార్చుకుంటున్నారు. మూస కథలతో విసిగిస్తున్న యంగ్ హీరోలు ఈమధ్య కాన్సెప్ట్ కథలతో ప్రేక్షకుల్ని ఎట్రాక్ట్ చేస్తున్నారు. లేటెస్ట్ గా విష్వక్ సేన్ కూడా ఈ లిస్ట్ లో కి వచ్చేశాడు.

New Films Launch: రెడీ.. యాక్షన్ బాబు.. కొత్త సినిమాలతో స్టార్స్ బిజీ

కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గరనుంచి యాక్షన్, మాస్ సినిమాలతో యూత్, మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకున్న ఈ మాస్ కా దాస్.. ఇప్పుడు సడెన్ గా రూట్ మార్చాడు. ఇప్పటి వరకూ రొటీన్ కమర్షియల్ సినిమాలు చేసిన విష్వక్.. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ తో వస్తున్నాడు. అశోక వనంలో అర్జున కళ్యాణం అనే ఇంట్రస్టింగ్ సినిమాలో క్యారెక్టర్ తో పాటు కంప్లీట్ లుక్ కూడా చేంజ్ చేసిన విష్వక్.. ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేస్తున్నాడు.

Vinodhaya Sitham: మేనల్లుడితో పవన్.. స్వీయ నిర్మాణంలో రీమేక్?

సినిమాల విషయంలో యాక్షన్, లవ్, రొమాన్స్, మాస్ ఇలా ఎన్ని ప్రయోగాలు చేసినా కూడా పెద్దగా వర్కవుట్ కాని శర్వానంద్.. ఈసారి కాన్సెప్ట్ మూవీతో వస్తున్నారు. ఆడవాళ్లూ మీకు జోహార్లు అనే టైటిల్ తోనే ఇంట్రస్ట్ క్రియేట్ చేసిన శర్వా ఈ సినిమాలో ఖుష్బూ, రాధిక, రష్మిక లాంటి స్టార్ కాస్ట్ తో నటిస్తున్నారు. టీజర్స్, సాంగ్స్ తో ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తున్న మూవీతో హిట్ కొడతానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు శర్వానంద్.

Aadavallu Meeku Joharlu: టైటిల్ సాంగ్ రిలీజ్.. దేవిశ్రీ మార్క్ కిర్రాక్ అంతే!

హిట్, ఫ్లాప్ తో సంబంధం లేకుండా నచ్చిన సబ్జెక్ట్ తో సినిమాలు చేసుకుంటూ వెళ్లే శ్రీవిష్ణు కూడా ఈసారి డిఫరెంట్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. లాస్ట్ ఇయర్ గాలి సంపత్, రాజరాజచోర, అర్జున-ఫల్గుణ అంటూ డిఫరెంట్ జానర్స్ చేసిన శ్రీవిష్ణు.. ఈ సారి సొసైటీలో ఉన్న ప్రాబ్లమ్స్ బేస్ చేసుకుని కొత్త కాన్సెప్ట్ తో భళాతందనాన సినిమా చేస్తున్నారు.

SSMB 28: మహేష్-త్రివిక్రమ్-పూజా.. హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు

బ్రోచేవారెవరురా సినిమాతో టాలీవుడ్ ని ఎట్రాక్ట్ చేసిన నవీన్ పోలిశెట్టి.. జాతిరత్నాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ట్ అయిపోయాడు. క్రేజీ కామెడీతో ఆడియన్స్ ని హిలేరియస్ గా నవ్వించిన నవీన్.. ఇప్పటికీ ఆ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే లేటస్ట్ గా నవీన్ అనగనగా ఒక రాజు అనే ఇంట్రస్టింగ్ కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు. దీనికి సంబంధించి రిలీజ్ అయిన టీజర్.. సినిమా మీద ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.

Allu Arjun: బన్నీ కొత్త యాడ్.. మొన్న బస్ ఎక్కమని.. నేడు తినమని!

అప్ కమింగ్ హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కూడా కొత్త కాన్సెప్ట్ మూవీ చేస్తున్నాడు. స్టూవర్ట్ పురం దొంగ టైటిల్ తో కె.ఎస్ డైరెక్షన్లో తెరకెక్కబోతోంది ఈ క్రేజీ మూవీ. ఎ టైగర్ బయోపిక్ అంటూ రెండు తుపాకులు పట్టుకుని డిఫరెంట్ గెటప్ లో మాస్ రా లుక్ లో సాయిశ్రీనివాస్ సరికొత్తగా కనిపిస్తున్నారు. రొటీన్ కమర్షియల్ సినిమాల నుంచి గ్యాప్ తీసుకుని స్టోరీ డ్రివెన్ సినిమాల వైపు వెళుతూ సక్సెస్ కోసం ట్రై చేస్తున్న సాయిశ్రీనివాస్ లుక్ సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేస్తోంది.

Bhumi Pednekar: అందాలు అస్సలు దాచుకొని భూమి!

బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తున్న మరో యంగ్ డైరెక్టర్ కిరణ్ అబ్బవరం కూడా ఈ సారి కొత్త కాన్సెప్ట్ తోసినిమా చేస్తున్నాడు. ఇప్పటి వరకూ లవ్ స్టోరీ లు చేసిన కిరణ్ కొత్త కాన్సెప్ట్ ట్రై చేస్తున్నాడు. సెబాస్టియన్ పిసి 524 అనే టైటిల్ తో ఎమోషనల్ కాప్ స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కిరణ్ అబ్బవరం పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నారు.

NTR 30: ఔను నిజమే.. ఎన్టీఆర్ సినిమాపై అలియా క్లారిటీ!

కెరీర్ స్టార్టింగ్ నుంచి బిగ్గెస్ట్ సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ.. రకరకాల సినిమాలు చేసి అన్ని జానర్స్ ను టచ్ చేసిన ఆది.. ఈ సారి అంతకుమించిన కథతో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. క్రైమ్ సీన్ ఇన్వెస్టిగేషన్ బ్యాక్ డ్రాప్ లో క్రేజీ యాక్షన్ థ్రిల్లర్ గా సిఎస్ ఐ సనాతన్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ కాన్సెప్ట్ మూవీలో సీరియస్ రోల్ ప్లే చేస్తున్నారు ఆదిసాయికుమార్.