Film Directors: బీవీఎస్ రవి-హరీష్ శంకర్ ట్విట్టర్ వార్.. అసలేం జరిగింది?

హరీష్ శంకర్.. బీవీఎస్ రవి.. ఇద్దరూ తెలుగు సినీ ఇండస్ట్రీలో రైటర్స్ కమ్ డైరెక్టర్స్. దర్శకత్వం ఎలా ఉన్నా ఈ ఇద్దరి రైటింగ్స్ అంటే ఇండస్ట్రీలో కూడా చాలా గుడ్ విల్ ఉంది.

Film Directors: బీవీఎస్ రవి-హరీష్ శంకర్ ట్విట్టర్ వార్.. అసలేం జరిగింది?

Film Directors

Updated On : February 4, 2022 / 7:59 PM IST

Film Directors: హరీష్ శంకర్.. బీవీఎస్ రవి.. ఇద్దరూ తెలుగు సినీ ఇండస్ట్రీలో రైటర్స్ కమ్ డైరెక్టర్స్. దర్శకత్వం ఎలా ఉన్నా ఈ ఇద్దరి రైటింగ్స్ అంటే ఇండస్ట్రీలో కూడా చాలా గుడ్ విల్ ఉంది. ఆహాలో వచ్చే బాలకృష్ణ అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే షోను రవినే రచయిత. కాగా.. ఈ ఇద్దరూ కూడా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు.

Vinodhaya Sitham: మేనల్లుడితో పవన్.. స్వీయ నిర్మాణంలో రీమేక్?

అయితే.. తాజాగా ఈ ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ నడిచింది. రవి చేసిన ఒక ట్వీట్ కి హరీష్ శంకర్ కౌటర్ ట్వీట్ తో మొదలైన రచ్చ ట్వీట్ల వర్షంలా మారి పెద్ద రచ్చగా మారింది. రవి ‘అనుభవించమని ఇచ్చిన అధికారాన్ని ప్రదర్శించడం మొదలెడితే ప్రజలు పతనం పరిచయం చేస్తారని తరతరాల ప్రజాస్వామ్య చరిత్ర చెబుతోంది’ అంటూ ట్వీట్‌ చేశాడు. ఇక ఈ ట్వీట్‌కు దర్శకుడు హరీశ్‌ శంకర్‌ రిప్లై ఇస్తూ.. ‘అనుభవించమని ఇచ్చారా.?’ అని రీట్వీట్‌ చేశాడు.

SSMB 28: మహేష్-త్రివిక్రమ్-పూజా.. హ్యాట్రిక్ సినిమాపై భారీ అంచనాలు

దీనికి రవి బదులిస్తూ.. ‘దయచేసి నేను వేసిన సెటైర్‌ను ఎంజాయ్‌ చేయండి. గాడ్‌ బ్లెస్‌ యూ’ అంటూ సమాధానం ఇవ్వడంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగిపోయింది. ఇలా ఒకరిపై ఒకరు వరుసగా కౌంటర్లు వేసుకుంటూ పోవడం.. ఒకరి సినిమాలను, షోలను మరొకరు మెన్షన్ చేస్తూ కౌంటర్లు వేస్తూ రెచ్చిపోయారు. ఇది నెటిజన్లకు ఎంటర్ టైన్మెంట్ గా మారగా.. అసలు ఈ ఇద్దరి మధ్య ఈ యుద్ధం ఏంటా అని ఇండస్ట్రీలో చర్చ మొదలైంది. ఈ ఇద్దరి మధ్య పాత గొడవలు ఏమైనా ఉన్నాయా.. లేక ప్రొఫెషనల్ వార్ ఏమైనా నడిచిందా అని కూడా ఆరా తీస్తున్నారు.