Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

స్టార్స్ తో సినిమాలు చేశారు.. దెబ్బకు ఇండస్ట్రీలో సెటిలైనట్టేనని కలలు కన్నారు కానీ.. ఈ డైరెక్టర్స్ ఇంకా సైలెంట్ మోడ్ లోనే లైఫ్ గడిపేస్తున్నారు. పవన్ కల్యాణ్, ప్రభాస్ తో సినిమాలు..

Tollywood Directors: స్టార్స్‌తో సినిమాలు చేసినా.. పట్టాలెక్కని నెక్స్ట్ ప్రాజెక్ట్స్!

Tollywood Directors

Tollywood Directors: స్టార్స్ తో సినిమాలు చేశారు.. దెబ్బకు ఇండస్ట్రీలో సెటిలైనట్టేనని కలలు కన్నారు కానీ.. ఈ డైరెక్టర్స్ ఇంకా సైలెంట్ మోడ్ లోనే లైఫ్ గడిపేస్తున్నారు. పవన్ కల్యాణ్, ప్రభాస్ తో సినిమాలు చేస్తున్నారంటే నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఆటోమేటిక్ గా సెట్ అయిపోవాలి. కానీ నెక్ట్స్ ఏంటి అనే డైలామాలో పడ్డారు వీళ్లు.

Tollywood Directors: తెలుగు సినిమాని కొత్తగా చూపిస్తున్న రూల్స్ బ్రేకర్స్!

పెద్ద స్టార్స్ తో లక్కీ ఆఫర్ తగిలిందంటే.. ఆ డైరెక్టర్స్ కి ఆడియెన్స్ లో ఫుల్ క్రేజ్ వస్తుంది. ఇండస్ట్రీలో కూడా సెంటర్ ఆప్ ది అట్రాక్షన్ అవుతారు. మిగిలిన స్టార్స్ కూడా వీళ్ల కథలు వినేందుకు రెడీ అవుతారు. కానీ మ్యాసివ్ హిట్ భీమ్లా నాయక్ ను తీసుకొచ్చిన సాగర్ చంద్ర సైలంటయిపోయాడు. నెక్ట్స్ ప్రాజెక్ట్ ఏంటనే దానిపై సరైన క్లారిటీ లేదు. ఏకే ఎంటర్ టైన్మెంట్స్ లో సినిమా అంటున్నారు కానీ పట్టాలెక్కేవరకు అనుమానమే. భీమ్లానాయక్ విషయంలో డైరెక్టర్ సాగర్ చంద్రను త్రివిక్రమ్ డామినేట్ చేసేలా ప్రచారం జరగడమే ఆయనకు మైనస్ గా మారిందనేది వాస్తవం.

Tollywood Directors: రెడీ బాబూ రెడీ.. ఈ దర్శకుల సినిమాలు మొదలెప్పుడు?

పవన్ కల్యాణ్ లాస్ట్ ఇయర్ బ్లాక్ బస్టర్ వకీల్ సాబ్ డైరెక్టర్ పరిస్థితీ ఊహించినట్టు లేదు. పింక్ రీమేక్ ను తెలుగు నేటివిటీకి మార్చి పవర్ స్టార్ కు సూపర్ హిట్ ఇచ్చాడు వేణూశ్రీరామ్. వకీల్ సాబ్ టైమ్ లో వేణూ పేరు బాగానే వినిపించింది. ఆ తర్వాత అల్లు అర్జున్, దిల్ రాజు కాంబినేషన్ లో ఈ డైరెక్టర్ ఐకాన్ అన్నారు. కానీ అనూహ్యంగా ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లింది. దీంతో స్టార్ హీరో కాంబోలో దిల్ రాజు మరేదైనా క్రేజీ ఆఫర్ ఇస్తారేమో అని ఇంకా వెయిట్ చేస్తూనే ఉన్నాడు వేణూశ్రీరామ్.

Tollywood Directors: డైరెక్టర్‌లు రెడీ.. స్టార్ హీరోల సినిమాలు స్టార్టయ్యేదెప్పుడు?

ప్రభాస్ డైరెక్టర్స్ కూడా అంతే.. అలా మెరిసి ఇలా సైలంటయిపోయారు. బాహుబలి 2 తర్వాత ఎన్నో అంచనాలతో సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమాల డైరెక్టర్స్ సుజిత్, రాధాకృష్ణ బజ్ క్రియేట్ చేశారు కూడా. కానీ ఈ సినిమాల రిజల్ట్ దెబ్బకొట్టింది. సాహో బాలీవుడ్ హిట్ కొడితే.. రాధేశ్యామ్ అదే బాలీవుడ్ ను మెప్పించలేకపోయింది. అయితే ప్రభాస్ లాంటి నేషనల్ కటౌట్ సినిమాలతో మెరిసిన డైరెక్టర్స్ చేతిలో ప్రస్తుతానికి మరో ప్రాజెక్ట్ లేదు. సాహో వచ్చి మూడున్నరేళ్లవుతున్నా.. సుజిత్ పేరు గాసిప్స్ లో వినిపించడమే కానీ అఫీషియల్ చేసింది లేదు. ఇటు కొవిడ్ తో రాధేశ్యామ్ రెడీ చేయడానికే తంటాలు పడ్డ రాధాకృష్ణ మరో మూవీని ఎప్పుడు ప్రకటిస్తాడో ఐడియా లేదు.