Tollywood Directors: రెడీ బాబూ రెడీ.. ఈ దర్శకుల సినిమాలు మొదలెప్పుడు?

సెకండ్ వేవ్ తర్వాత బ్యాలెన్స్ ఉన్న షూటింగ్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్లు. అంతేకాదు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్..

Tollywood Directors: రెడీ బాబూ రెడీ.. ఈ దర్శకుల సినిమాలు మొదలెప్పుడు?

Tollywood Directors: సెకండ్ వేవ్ తర్వాత బ్యాలెన్స్ ఉన్న షూటింగ్స్ ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తున్నారు డైరెక్టర్లు. అంతేకాదు ఆల్రెడీ కమిట్ అయిన సినిమాల ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా హై స్పీడ్ లో చేస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లయితే సెట్స్ మీదకెళ్లేదెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు. టాలీవుడ్ టాప్ డైరెక్టర్లు ఫుల్ బిజీగా ఉన్నారు. ఆల్రెడీ కోవిడ్ తో లేట్ అయిపోయిన తమ సినిమాల్ని సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తూనే.. కొత్త సినిమాలకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ఎంగేజ్ అయిపోయారు. ఎప్పటినుంచో కలలు కంటున్న తమ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ట్రాక్ ఎక్కించడానికి రెడీ అవుతున్నారు డైరెక్టర్లు. అటు హీరోలు కూడా అఫీషియల్ అనౌన్స్ మెంట్స్ ఇచ్చి రెడీగా ఉన్నారు.

Theater Release Films: ఊరించి ఉడికించి ఈ వారం థియేటర్‌లో వచ్చేస్తున్న సినిమాలు!

ప్రస్తుతం సలార్ షూటింగ్ తో ఫుల్ బిజీగా ఉన్నాడు ప్రశాంత్ నీల్. పనిలో పనిగా నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి వీలైనప్పుడల్లా చర్చలు జరుపుతూనే ఉన్నాడు. రామ్ చరణ్, బన్నీ, ఎన్టీఆర్ వంటి స్టార్స్ తో మీటింగ్స్ పెడుతున్నాడు. అయితే ప్రభాస్ తర్వాత తారక్ తో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ప్రశాంత్ నీల్ సినిమా పట్టాలెక్కనుంది. ఎన్టీఆర్ తో మూవీ పూర్తయ్యాకే.. రామ్ చరణ్ తో కాంబినేషన్ సెట్ కానుంది. తారక్, చరణ్ తర్వాత ప్రశాంత్ నీల్ మూవీ అల్లు అర్జున్ తో ఉండే ఛాన్స్ లేకపోలేదు.

SSMB 28: క్రేజీ అప్డేట్.. మహేష్-త్రివిక్రమ్ సినిమాలో సంజయ్ పాత్ర ఇదే?

ప్రజెంట్ పుష్ప పార్ట్ 1 పనులు పూర్తి చేస్తోన్న డైరెక్టర్ సుకుమార్.. నెక్ట్స్ సినిమాపై కూడా మాస్టర్ ప్లాన్స్ వేస్తున్నారు. బన్నీతో చేస్తున్న సమయంలోనే విజయ్ దేవరకొండతో సినిమా అనౌన్స్ చేశారు సుకుమార్. అయితే ఒక సినిమా అనుకున్న పుష్ప.. 2 పార్ట్స్ అవ్వడంతో ఈ సినిమా మీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు. పుష్ప పార్ట్1 తర్వాత గ్యాప్ లో విజయ్ దేవరకొండతో సుకుమార్ ఆర్య 3 చేసే ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. మరి విజయ్ తో సినిమా సెట్స్ మీదకెళ్లేదెప్పుడో అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్.

Radhe Shyam: ప్రమోషన్స్ స్పీడప్.. మరో సింగిల్ వచ్చేస్తుంది!

అల వైకుంఠపురంలో తర్వాత ఇప్పటి వరకూ డైరెక్టర్ గా సినిమా స్టార్ట్ చేయలేదు కానీ భీమ్లా నాయక్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్నారు త్రివిక్రమ్. ముందు ఎన్టీఆర్ తో అనుకున్నా.. చివరికి మహేష్ బాబుతో సినిమా అనౌన్స్ చేసారు. అయితే మహేశ్ సర్కారు వారి పాట పూర్తైన తర్వాత ఈ నెల ఎండింగ్ లో త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించే అవకాశముంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే సంక్రాంతి తర్వాత వీళ్లిద్దరి సినిమా రెగ్యులర్ షూటింగ్ కి వెళ్తుంది. మహేశ్ మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవితో మూవీకి కూడా త్రివిక్రమ్ కమిటైనట్టు వార్తలొస్తున్నాయి. ఇక త్రివిక్రమ్ లైన్ లో తారక్, బన్నీ కూడా ఉన్నారని అంటున్నారు.

Manasanamaha: ఆస్కార్‌కు నామినేటైన తొలి తెలుగు షార్ట్ ఫిల్మ్.. దీని ప్రత్యేకత ఏంటంటే?

మరో స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా నెక్ట్స్ సినిమా స్టార్ట్ చెయ్యడానికి రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ షూటింగ్ అయిపోవడంతో ఎన్టీఆర్ ఫ్రీ అయిపోయారు. అటు కొరటాల కూడా ఆచార్య సినిమా రిలీజ్ పనుల్లో ఉన్నారు. అంతేకాదు మరోవైపు ఎన్టీఆర్ తో సినిమాకి ప్రీప్రొడక్షన్ కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. కేవలం 3 షెడ్యూళ్లలోనే ఈ మూవీని పూర్తి చేయాలనేది ప్లాన్. జనతా గ్యారేజ్ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకెళ్లేది ఇయర్ ఎండ్ కే అంటున్నారు అందరూ. తారక్ తర్వాత మహేశ్ బాబుతో మూవీ అనుకుంటున్నారు కొరటాల. బాలయ్యతో కూడా ప్రాజెక్ట్ ఒకటి మాటల్లో ఉంది. బాలకృష్ణతో చేసే సినిమా భారీ మల్టీస్టారర్ అనే టాక్ ఈమధ్య బాగా ట్రెండయింది.

Raai Laxmi: బాబోయ్.. ఏంటీ రచ్చ రత్తాలు!

టాలీవుడ్ టాప్ డైరెక్టర్ రాజమౌళి.. ట్రిపుల్ఆర్ సినిమా రిలీజ్ కు రెడీ అవుతున్నారు. ట్రిపుల్ ఆర్ మూవీ అయిపోక ముందే సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేస్తున్నానని అనౌన్స్ చేశారు. దక్షిణాఫ్రికా ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా ఈ మూవీని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం కథను ఫైనల్ చేస్తున్నారు విజయేంద్ర ప్రసాద్. జనవరి తర్వాత ఫ్రీ అయిపోతున్న రాజమౌళి.. మహేష్ తో సినిమాని సమ్మర్ కి స్టార్ట్ చేస్తాడనే న్యూస్ వినిపిస్తోంది. ఈలోపు మహేశ్ త్రివిక్రమ్ మూవీని పూర్తి చేస్తారు.

Bigg Boss 5: హౌస్‌లో మళ్ళీ పింకీ.. మానస్‌కి మస్సాజ్!

టాలీవుడ్ లో క్రేజీ డైరెక్టర్ పూరీ జగన్నాద్ నెక్ట్స్ పై కూడా చాలా రూమర్స్ వస్తున్నాయి. ప్రజెంట్ విజయ్ దేవరకొండ తో చేస్తున్న లైగర్ సినిమా తర్వాత పూరీజగన్నా.. పైసా వసూల్ కాంబోను రిపీట్ చేసే ఛాన్స్ ఉంది. బాలకృష్ణతో మరో క్రేజీ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు పూరీ. మరోవైపు రౌడీ హీరో లైగర్ తోనే మరోసారి కాంబో ఫిక్స్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ సుకుమార్ తో కమిట్ మెంట్ ఉన్న విజయ్.. వెంటనే పూరీతో సినిమా చేస్తాడా అన్నది మాత్రం డౌటే.

Pushpa: ఫుల్ స్పీడ్ ప్రమోషన్లు.. పుష్ప ఫీవర్ తెగపెంచేస్తున్న సుక్కు!

ఈ మధ్య ఫుల్ గా ఫన్ డోస్ ఇస్తోన్న డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా వరుసగా సినిమాలను లైన్ లో పెట్టాడు. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ తో బిజీగా ఉన్న రావిపూడి.. నెక్ట్స్ సినిమాను బాలకృష్ణతో ప్లాన్ చేసినట్టు చెప్పేసాడు. పనిలో పనిగా చిరూ, పవన్ కల్యాణ్ వంటి మెగా హీరోలకు కూడా కథలు వినిపిస్తున్నాడు. త్వరలోనే అనిల్ నుంచి ఎలాంటి బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చినా ఆశ్చర్యం లేదు.