Bigg Boss 5: హౌస్‌లో మళ్ళీ పింకీ.. మానస్‌కి మస్సాజ్!

బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం ఆసన్నమైంది. ఇంటి నుండి ఇప్పటికే పదమూడు మంది ఎలిమినేట్ కాగా..

Bigg Boss 5: హౌస్‌లో మళ్ళీ పింకీ.. మానస్‌కి మస్సాజ్!

Bigg Boss 5: బిగ్ బాస్ ఐదవ సీజన్ ముగిసే సమయం ఆసన్నమైంది. ఇంటి నుండి ఇప్పటికే పదమూడు మంది ఎలిమినేట్ కాగా.. మరో ఆరుగురు మాత్రమే ఇప్పుడు ఇంట్లో ఉన్నారు. మరో ఎలిమినేషన్ ముగిస్తే ఇక ఫైనల్ కి చేరుకున్నట్లే. అయితే.. షో చివరి దశకి వచ్చేకొద్దీ షో నిర్వాహకులు ఎంటర్ టైన్మెంట్ డోస్ తో పాటు టాస్కుల జోరు కూడా పెంచేసి ప్రేక్షకులను డబుల్ ఫన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఎపిసోడ్ లో ఓ ఫన్నీ టాస్క్ ప్లాన్ చేశారు.

Mouni Roy: మౌనీ కిల్లర్ లుక్స్.. ఖేల్ ఖతం అంతే!

తాజాగా విడుదలైన మంగళవారం ఎపిసోడ్ ప్రోమో ప్రియాంకా మానస్ కి మస్సాజ్ చేసింది. గత వారమే పింకీ ఎలిమినేట్ అయితే మళ్ళీ ఇంట్లోకి ఎలా అనుకుంటున్నారా.. అదే టాస్క్. గతంలో ఇంట్లో జరిగిన కొన్ని ఘటనలను రోల్ ప్లే ద్వారా మళ్ళీ సీన్ క్రియేట్ చేయడమే టాస్క్. అయితే.. ఇక్కడ పింకీగా మానస్ చేస్తే.. మానస్ గా సన్నీ చేశాడు. ఇక గతంలో షన్ను-సిరిల మధ్య అప్పడం వివాదంతో పాటు ఇంట్లో ఉన్న కంటెస్టెంట్ల అందరికి జరిగిన కొన్ని ఘటనలను బిగ్ బాస్ ఇలా మళ్ళీ ఆడించాడు.

Balakrishna: ఢీ అంటే ఢీ.. బాలయ్యలో ఇంతకు ముందెన్నడూ లేని జోష్!

ఈ టాస్క్ లో శ్రీరామ్ లోబోలా మారి చెలరేగి ఆడినట్లు కనిపిస్తుండగా సన్నీ కూడా సిరిలా.. మానస్ లాగా సూపర్బ్ ఫుల్ క్రియేట్ చేశాడు. సోమవారం ఎపిసోడ్ లో ఒకటి నుండి ఆరు స్థానాల సెలక్షన్ లో కూడా సీరియస్ తగ్గించి ఫన్ మీదనే కాన్షన్ట్రేట్ చేసిన షో నిర్వాహకులు.. ఇకపై వచ్చే ఎపిసోడ్స్ లో కూడా ఇదే తరహా ఎంటర్ టైన్మెంట్ మీదనే ఫోకస్ చేసినట్లుగా అనిపిస్తుంది. మరి, ఈ ఎపిసోడ్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో ఈ రాత్రికి చూడాలి.

RRR: ఒకేరోజు 4 చోట్ల ట్రైలర్ లాంచ్.. యూనిట్ కోసం స్పెషల్ ఫ్లైట్!