RRR: ఒకేరోజు 4 చోట్ల ట్రైలర్ లాంచ్.. యూనిట్ కోసం స్పెషల్ ఫ్లైట్!

ఇప్పుడు టాలీవుడ్ సినిమాలపై ఉన్న ఉత్కంఠ మరే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా లేదు. ఏ సినిమాకి ఆ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు, అభిమానులు నరాలు తెగేంత..

RRR: ఒకేరోజు 4 చోట్ల ట్రైలర్ లాంచ్.. యూనిట్ కోసం స్పెషల్ ఫ్లైట్!

RRR: ఇప్పుడు టాలీవుడ్ సినిమాలపై ఉన్న ఉత్కంఠ మరే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కూడా లేదు. ఏ సినిమాకి ఆ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు, అభిమానులు నరాలు తెగేంత ఉత్కంఠగా ఎదురుచూస్తుండగా.. ఇతర భాషలు, ఇంతర ఇండస్ట్రీలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఇప్పటికే ట్రైలర్ కు ముహూర్తం పెట్టేసిన దర్శకులు రాజమౌళి మరోవైపు ఒక్కో పోస్టర్, ఒక్కో అప్డేట్ విడుదల చేస్తూ మరింత క్యూరియాసిటీని పెంచే పనిలో ఉన్నాడు. మరో రెండు రోజులలో (డిసెంబర్ 9న) విడుదల చేయనున్న ట్రైలర్ కోసం భారీ ప్లాన్ సిద్ధం చేశారట.

Akhanda: అఖండ మాస్ జాతర.. ఐదవ రోజూ కాసుల వర్షం!

ఒకేరోజు నాలుగు బాషలలో.. అటు ఉత్తరాది నుండి ఇటు దక్షణాది అన్ని బాషల వరకు విడుదల చేసేందుకు ప్లాన్ చేసిన ఆర్ఆర్ఆర్ యూనిట్ ఇందుకోసం భారీ ప్లాన్ సిద్ధం చేసుకుంది. మొదటగా ఈ మహా ట్రైలర్ లాంచ్ గ్రాండ్ ఈవెంట్ ని ముంబై పీవీఆర్ ఓబ్రియో మాల్ లో ఘనంగా ప్లాన్ చేసినట్లు తెలుస్తుండగా.. ఈ వేడుకకి దర్శకుడు రాజమౌళి, నటీనటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ లు అజయ్ దేవగణ్, ఆలియా భట్, శ్రేయాసరన్ తదితర యూనిట్ మొత్తం పాల్గొననుందట.

Samantha : చైతూతో విడిపోయిన తర్వాత చనిపోతా అనుకున్నాను : సమంత

ఉదయం 11 గంటలకి ముంబైలో ఈ ట్రైలర్ ని లాంచ్ ఈవెంట్ జరగనుండగా.. అక్కడ నుండి చెన్నై, బెంగళూరు, చివరిగా హైదరాబాద్ చేరుకొని ట్రైలర్ లాంచ్ చేయనున్నారు. ముంబై నుండి హైదరాబాద్ వయా బెంగళూరు, చెన్నై వరకు ప్రమోషన్ పర్యటనల నిమిత్తం యూనిట్ కోసం ఏకంగా ఒక స్పెషల్ ప్రైవేట్ ఫ్లైట్ ని హైర్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా సినిమా భారీస్థాయికి తగ్గట్లే ట్రైలర్ లాంచింగ్ కూడా అదే స్థాయిలో ప్లాన్ చేసినట్లు తెలుస్తుండగా.. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏ స్థాయిలో ఉంటుందోనని చర్చలు మొదలయ్యాయి.