Balakrishna: ఢీ అంటే ఢీ.. బాలయ్యలో ఇంతకు ముందెన్నడూ లేని జోష్!

ఇంతకు ముందు ఎన్నడూ లేని జోష్.. ఎప్పుడో కుర్ర హీరోగా ఉన్నప్పటి ఎనర్జీ.. ఢీ అంటే ఢీ అంటున్నాడు బాలయ్య.. ఎగిరి గంతులేస్తున్నాడు. చిన్న పిల్లాడిలా ఆటలాడుతున్నాడు

Balakrishna: ఢీ అంటే ఢీ.. బాలయ్యలో ఇంతకు ముందెన్నడూ లేని జోష్!

Balakrishna

Balakrishna: ఇంతకు ముందు ఎన్నడూ లేని జోష్.. ఎప్పుడో కుర్ర హీరోగా ఉన్నప్పటి ఎనర్జీ.. ఢీ అంటే ఢీ అంటున్నాడు బాలయ్య.. ఎగిరి గంతులేస్తున్నాడు. చిన్న పిల్లాడిలా ఆటలాడుతున్నాడు. అఖండ విజయంతో ఫుల్ జోష్ మీద ఉన్నాడు. అన్ స్టాపబుల్ అంటూ దూసుకుపోతున్న నటసింహం బాలకృష్ణ దేనికైనా రెడీ అంటున్నారు.

Bheemla Nayak: లాలా భీమ్లా.. జనవరిలో లేనట్లేనా?

నటసింహం బాలకృష్ణ జోరుమీద ఉన్నారు. కుర్ర హీరోలకంటే ఎక్కువ హుషారు చూపిస్తున్నారు. చంటి పిల్లాడిలా ఎగిరి గంతులేస్తున్నాడు. అఖండ సక్సెస్ జోష్ తో పాటు అన్ స్టాపబుల్ అంటూ హడావిడి చేస్తున్నారు బాలయ్య. లాంగ్ టైమ్ తరువాత బాలకృష్ణను సూపర్ సక్సెస్ వరించింది. పైసా వసూల్ తరువాత వరుస ప్లాప్ లతో ఇబ్బంది పడ్డ బాలయ్యకు.. అఖండ బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో.. హుషారు వచ్చేసింది. అందులోనే బోయపాటి కాంబోలో హ్యాట్రిక్ పడటంతో ఫ్యాన్ బేస్ లో కూడా జోష్ వచ్చింది.

RRR: ఒకేరోజు 4 చోట్ల ట్రైలర్ లాంచ్.. యూనిట్ కోసం స్పెషల్ ఫ్లైట్!

ఇక ఈ మధ్య బాలయ్యలో చాలా మార్పు వచ్చింది. అసలు నిజామా.. కలనా.. అన్నట్టు బాలయ్య ఫస్ట్ టైమ్ హోస్ట్ గా అవతారం ఎత్తారు. ఫస్ట్ తెలుగు ఓటీటీ ఆహా కోసం యాంకర్ గా మారి సక్సెస్ ఫుల్ గా షోను రన్ చేస్తున్నారు. హోస్ట్ గా బాలయ్య చేస్తున్న అల్లరి.. గెస్ట్ లతో బాలయ్య ఆడుతున్న ఆటలు.. ఓ రేంజ్ లో సక్సెస్ అవుతున్నాయి. అన్ స్టాపబుల్ అంటూ ఫుల్ ఎనర్జిటిక్ గా బాలయ్య హోస్టింగ్ చేస్తున్నారు. ఇప్పటికే స్ట్రీమింగ్ అయిన మూడు ఎపిసోడ్స్ దుమ్మురేపుతున్నాయి. ప్రోమోస్ తోనే ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ నుక్రియేట్ చేస్తున్నాడు బాలయ్య. హోస్ట్ గా మెస్మరైజ్ చేస్తున్నారు.

Akhanda: అఖండ మాస్ జాతర.. ఐదవ రోజూ కాసుల వర్షం!

అంతే కాదు బాలయ్య ఆటీట్యూడ్ లో.. లుక్ లో.. రిసీవింగ్ లో.. యాక్టింగ్ లో ఇలా చాలా విషయాల్లో చాలా మార్పు వచ్చింది. 6పదుల వయస్సు ఉన్నా.. యంగ్ హీరోలు కూడా చూపించలేని ఎనర్జీని చూపిస్తున్నారు నటసింహం. అంతే కాదు దేనికైనా రెడీ అంటున్నారు. కథ నచ్చితే విలన్ గా నటించడానికైనా సై అంటూ.. హీరో కూడా నేనే అని కండీషన్స్ అప్లే అంటున్నారు బాలకృష్ణ. ఇటు అన్ స్టాపబుల్ లో స్టార్ గెస్ట్ లకు షాక్ ల మీద షాక్ లు ఇస్తూనే.. అటు వరుసగా సినిమాలు సెట్స్ ఎక్కించేస్తున్నారు. గోపీచంద్ మలినేని సినిమా పట్టాలెక్కింది. అనిల్ రావిపూడి, పూరీ జగన్నాథ్ లతో సినిమాలు లైనప్ చేస్తున్నారు బాలయ్య.